ఈ అకౌంట్ల యూజర్లు ఐటీ నిబంధనలను అతిక్రమించిన నేపథ్యంలో చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. మన దేశంలో 600 మిలియన్లకు పైగా వాట్సాప్ యూజర్లు ఉన్నారు. తన ఫ్లాట్ ఫామ్ నిబంధనలను ఉల్లంఘించిన వాళ్లపై వాట్సాప్ ఈ విధంగా చర్యలు తీసుకుంటోంది. బల్క్, స్పామ్ మెసేజ్ లను పంపుతున్న యూజర్లపై వాట్సాప్ చర్యలు తీసుకుంటూ ఉండటం గమనార్హం. మోసం లేదా తప్పుడు సమాచారం చేరవేస్తున్న వాళ్లపై వాట్సాప్ ప్రత్యేక దృష్టి పెట్టింది.
వాట్సాప్ స్థానిక చట్టాలకు వ్యతిరేకంగా అక్రమ కార్యక్రమాలకు పాల్పడినా చర్యలు తీసుకుంటోంది. ఆగష్టులో సైతం వాట్సాప్ 84.58 లక్షల ఖాతాలపై నిషేధం విధించింది. నిబంధనలను ఉల్లంఘించే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. వాట్సాప్ అకౌంట్ ఒకసారి బ్యాన్ అయితే మళ్లీ తిరిగి పొందడం కష్టం అని చెప్పవచ్చు.
వాట్సాప్ అకౌంట్ల విషయంలో బిజినెస్ కోసం వినియోగించే వాళ్లు వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ను తీసుకుంటే మంచిది. వాట్సాప్ ను ప్రస్తుతం ఫీచర్ ఫోన్లలో సైతం ఉపయోగిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వాట్సాప్ అకౌంట్లను తప్పుగా వాడితే మాత్రం నష్టపోక తప్పదని చెప్పవచ్చు. వాట్సాప్ అకౌంట్లను ఎక్కువగా ఉపయోగించే యూజర్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. వాట్సాప్ కు పోటీగా ఎన్నో మెసేజింగ్ యాప్స్ ఉన్నా ఆ యాప్స్ ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేదు. ఫ్రీగా వాట్సాప్ ను ఉపయోగించే సదుపాయం ఉండటం ఈ యాప్ కు ప్లస్ అవుతోంది.