ఇత్తడి :
పూర్వం నుంచి ఇత్తడి ప్రమిదల్లో దీపారాధన చేస్తున్నారు పూర్వికులు. ఇత్తడి ప్రమిదల్లో దీపం వెలిగిస్తే బంగారు ప్రమిదలో వెలిగించినంత ఫలితం రావడంతో పాటు ఆయుష్షు కూడా పెరుగుతుందట.
కంచు : ఈ ప్రమిదలు స్టీలు ని పోలి ఉంటాయి . కంచు ప్రమిదల్లో దీపం వెలిగిస్తే రోగ బాధలు .. అకాల మృతి దరిచేరకుండా ఉంటాయి.
పంచలోహాలు : బంగారం - వెండి - రాగి - ఇత్తడి - కంచు కనిపించే ప్రమిదల్ని పంచలోహాల ప్రమిదలు అంటారు. వీటిల్లో దీపారాధన చేస్తే సుఖశాంతులు లభిస్తాయి.
మట్టి ప్రమిదలు : ఆవు నెయ్యితో మట్టి ప్రమిదల్లో దీపం వెలిగిస్తే శుభ ఫలితం కలుగుతుంది.
పిండి ప్రమిద :
పిండితో బియ్యం పిండిలో కొద్దిగా పసుపు కలిపి ప్రమిదని చేస్తారు. కార్తీకమాసంలో శివాలయాల్లో ఎక్కువగా ఈ దీపం పెడతారు.. దీంతో కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం.
ఉసిరికాయ :
కార్తీకమాసంలో ఎక్కువగా దొరికే ఉసిరికాయలతో తులసి కోట దగ్గర దీపారాధన చేస్తారు. దీంతో నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఉసిరి చెట్టు వద్ద కూడా దీపాలు వెలిగిస్తారు.
వెండి :
కొందరు పూజ గదిలో ఈ ప్రమిదలో దీపం వెలిగిస్తారు.. ఇలా చేయడం వల్ల సంపద వృద్ధి చెందుతుంది. ఇనుము :
అలాగే స్టీలు - ఇనుమ ప్రమిదల్లో కూడా దీపాలను వెలిగించకూడదు. వాటిని అశుభానికి మాత్రమే ఉపయోగిస్తారుదేవుడి దగ్గర వీటితో పూజ చేయకూడదని పురాణాలనుంచి వాడుకలో ఉంది.