వీరు పది సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటూ పశుపోషణ చేస్తూ వస్తున్నారు. అందరి ఇళ్ల దెబ్బ నుంచి పేడను ట్రక్కుల్లో తీసుకువచ్చి గ్రామంలోని బీరేశ్వర స్వామి ఆలయం ఆవరణలో దిబ్బగా వేస్తారు. అక్కడ నుంచి పొలానికి వెళ్లి అక్కడ పనిచేసే ఇద్దరు యువకులను గ్రామ పెద్ద ఎంచుకుంటారు. వారికి గడ్డితో మీసాలు గడ్డాలు తగిలిస్తారు మొదట నామాలు పెట్టి వారిని గాడిదలపై కూర్చోబెట్టి ఊరేగిస్తారు. గాడిదలపై వచ్చే యువకులను అబద్దాలకోరు - చాడీకోరు అని పిలుస్తారు అబద్ధాలు చెబుతూ స్థానికుల్లో ద్వేషాలు రెచ్చగొడతారని వారిపై పేడ వేస్తారు.. కొందరు ఆ యువకుల తరఫున మరికొందరు వ్యతిరేక జట్టులో ఉంటూ పేడ తో కొట్టుకుంటారు. రెండు మూడు గంటల పాటు ఈ వేడుక కొనసాగుతుంది.
ఇలా పేడతో కొట్టుకోవడం ద్వారా చర్మ వ్యాధులు పోతాయిని స్థానికుల విశ్వాసం. ఇక స్థల పురాణం మేరకు గ్రామ పెద్ద ఇంట్లో ఒక శివభక్తుడు పాలేరుగా పనిచేస్తుంటాడు. నిత్యం నుదుట విభూతి మెడలో రుద్రాక్షలను ధరించేవాడు. అతను మరణించిన అనంతరం మృతదేహాన్ని ఊరి చివరగా ఉన్న దిబ్బలో పడేశారు.. కొన్నాళ్ల అనంతరం ఆ దెబ్బ మట్టిని పొలానికి చెల్లేందుకు తవ్వుతున్న సమయంలో శివలింగం బయటపడుతుంది. అప్పటినుంచి పేడతో కొట్టుకునే ఆచరణ ప్రారంభమైందని స్థానికులు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. అదే నమ్మకాన్ని వారు కొన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తూ వస్తున్నారు.