ఈరోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ కిడ్నీ సమస్యలు పెరిగిపోతున్నాయి. కాబట్టి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విధంగా చేయండి. మనం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడే ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఒకటి. శరీరంలోని వ్యార్థాలను తొలగించి, రక్తాన్ని శుద్ధి చేయడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. అయితే జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, పలు ఇతర కారణాలతో ఇటీవల పలువురిలో కిడ్నీ సమస్యలు పెరిగిపోతున్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ వంటివి వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తున్నాయి.

అయితే సమస్య ప్రారంభమైనట్లు ముందుగానే గుర్తిసై, దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకు సంబంధించిన లక్షణాలేవి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఉదయం లేవగానే ఎవరికైనా ఫ్రెష్ గా అనిపిస్తుంది. చాలామంది ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపిస్తారు. కానీ మూత్రపిండాలలో ఏదైనా సమస్య ఉన్నవారు మాత్రం తీవ్రమైన అలసటకు గురవుతారు. కిడ్నీలు సరిగ్గా పని చెయ్యకపోవటం, టాక్సిన్లు శరీరంలో శరీరంలో పేరుకుపోవడం కారణంగా ఇలా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

 కాబట్టి ఉదయం పూట అలసట, శారీరక బలహీనత తరచుగా వేధిస్తుంటే కిడ్నీలో ఏదో సమస్య ఉందని అనుమానించి వైద్య నిపుణులను సంప్రదించాలి. కిడ్నీ ప్రాబ్లమ్స్ ను సులభంగా గుర్తించదగ్గ మరో లక్షణం యూరిన్ రంగు మారడం. ఉదయం పూట మూత్ర విసర్జన చేసే క్రమంలో అది చాలా లేతగా అనిపించడం, నురుగు ఎక్కువగా రావడం, క్రమంగా రంగు మారడం వంటివి గుర్తిస్తే మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లు అనుమానించాలి. మార్నింగ్ లేవగానే కడుపులో ఉబ్బరం లేదా తిమ్మిరి వంటి లక్షణాలు కొన్ని రోజులుగా కనిపిస్తుంటే మీ కిడ్నీలు ప్రమాదంలో ఉండవచ్చు. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు ఇలా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి ఇది గమనిస్తే గనుక వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: