చలికాలం వస్తే చాలు పిల్లలకి ఎక్కువగా జలుబు చేస్తూ ఉంటుంది. ఎక్కువగా బయట తిరగటం వల్ల జలుబు అనేది మరింతగా పెరిగిపోతుంది. దీపావళి తరువాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. మధ్యాహ్నం పూట కాస్త ఎండగా, ఉబ్బరంగా అనిపిస్తున్నప్పటికి ఉదయం, సాయంత్రం వేళలో మాత్రం చలి ఎక్కువగా ఉంటోంది. ఇక తెల్లవారుజాము నుంచి దాదాపు 7 గంటల వరకు వరకు మంచు కూడా కురుస్తుంది. ఇలాంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సహజంగానే సీజనల్ వ్యాధులు,

జలుబు వంటి సమస్యలు తలెత్తుతాయి. ప్రస్తుతం చాలామంది పిల్లలు జలుబు బారిన పడుతున్నారు. అయితే చలికాలంలో ఇది త్వరగా తగ్గాలంటే ఆయుర్వేదం ప్రకారం పాటించాల్సిన కొన్ని ఇంటి చిట్కాలేమిటో ఇప్పుడు చూద్దాం. జలుబును తగ్గించడంలో సెలరీ కషాయం అద్భుతంగా పనిచేస్తుంది. జలుబు వల్ల ముక్కు కారడం, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, శ్వాసలో ఇబ్బంది వంటివి తలెత్తుతాయి. అయితే దీని నివారణకు సెలెరి కషాయం చక్కగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. అందుకోసం ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ సెలెరీని వేసి మరిగించాలి.

వెంటనే కిందకు దించి జలుబు చేసిన పిల్లలకు దాని వాసన లేదా ఆవిరిని పీల్చమని చెప్పాలి. దీంతో ముక్కు దిబ్బడ నుంచి ఉపశ్రమమం కలుగుతుంది. పిల్లలకు, పెద్దలకు అందరికీ ఇది వరిస్తుంది. చలికాలంలో తలెత్తే సాధారణ సమస్యల్లో జలుబుతో పాటు అప్పటికే ఉన్న సైనస్, ఆస్తమా వంటివి మరింత అధికం అవుతాయి. దీంతో ఊపిరితిత్తులు బలహీనత పడతాయి. కాబట్టి నివారణ కోసం కొన్ని పుదీనా ఆకులను, ఒక టి స్పూన్ సెలెరి, కొన్ని నల్ల మిరియాలు, కొద్దిగా అల్లం తీసుకుని నీళ్లలో వేసి మరిగించాలి. దీని ఆవిరిని పీల్చడం వల్ల ఉపశ్రమమం కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా ట్రై చేస్తే వెంటనే జలుబు తగ్గుతుంది. అయితే చలికాలంలో ఇది త్వరగా తగ్గాలంటే ఆయుర్వేదం ప్రకారం పాటించాల్సిన కొన్ని ఇంటి చిట్కాలేమిటో ఇప్పుడు చూద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: