వర్కౌట్స్ చేయడం ఆరోగ్యానికి కూడా చాలా అవసరం. అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ వర్కౌట్ ను తప్పకుండా చేయండి. వర్కౌట్ చేయటం వల్ల తక్షణమే ఉపశ్రమణం పొందవచ్చు. ఈరోజుల్లో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే ఎంతో కొంత వర్కౌట్ చేయాల్సిందే. దీనికోసం చాలామంది జిమ్ కి వెళ్లి కష్టమైన వర్కౌట్ లు చేస్తుంటారు. ఈ వర్కౌట్స్ కష్టం అనుకునే వారు... ప్రతిరోజు కొంత సమయం నడిస్తే సరిపోతుందని నిపుణులు తెలుపుతున్నారు. రోజుకు కేవలం 30 నిమిషాలు నడవటం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, డయాబెటిస్, రక్తపోటును నియంతరించడంలో సహాయం పడుతుందని అధ్యాయనాలు చెబుతున్నాయి.

 అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం నడవటం వల్ల శారీరక ప్రయోజనాలు మాత్రమే కాకుండా మానసికంగా కూడా ప్రశాంతతను పొందుతారని నిపుణులు చెప్తున్నారు. గుండె సమస్యలకు చెక్. నడక మీ గుండెను బలపరచడమే కాకుండా.. రక్త ప్రసరణను మెరుగుపరిచే గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది. నడక మన శరీరంలోని అవసరమైన కేలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఊబకాయం సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారు నడవటం వల్ల సమస్యని చాలా వరకు తగ్గించవచ్చు. ఈ రోజుల్లో చాలామంది కీళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. కాళ్ళ లోని జాయింట్స్ లో జిగురు లాంటి పదార్ధం తగ్గటం వల్ల ఈ కీళ్ల నొప్పులు వస్తుంటాయి. అయితే, ప్రతిరోజు వాకింగ్ చేయటం వల్ల లిక్విడ్ గమ్ పెరిగి కీళ్ల నొప్పులు దూరం అవుతాయని ఆధ్యాయ నాలుగు తెలుపుతున్నాయి.

ప్రతిరోజు నడక ఆయుష్షును పెంచుతుందని ఆధ్యాయాణాలు చెబుతున్నాయి. నడక వల్ల 16 నుంచి 20 సంవత్సరాలు అదనంగా జీవించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. భోజనం చేసిన తరువాత లేదా మీకు వీలున్న సమయంలో 10 నిమిషాలు నడకను అలవాటు చేసుకోండి. భోజనం తరువాత నడక కండరాల గ్లూకోజ్ తీసుకోవటం పెరగటం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంతరించడంలో సహాయపడుతుంది. ఉదయమునే నడవడం వల్ల మెదడులో కణాలు క్రమంగా పనిచేసి, టెన్షన్, ఆందోళన సంబంధిత సమస్యలు తగ్గిస్తాయి. దీని గుండె ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, మెడకు చురుకుగా పనిచేస్తుంది. చాలామంది ఏదైనా అవసరం అయితే కొద్దిపాటి దూరానికి కూడా బైక్ లేదా కార్ ని ఉపయోగిస్తుంటాం. ఈ చిన్న చిన్న ప్రయాణాల కోసం డ్రైవింగ్ చేయడానికి బదులుగా సాధ్యమైనంత వరకు వాకింగ్ చేయడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: