హై బీపీ అనేది మానవ శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. హై బిపి .. అధిక రక్తపోటు అనేవి అనేక అనారోగ్య సమస్యలకు మూల కారణంగా నిలుస్తుంది. అధిక రక్తపోటును నియంత్రించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. మనం తీసుకునే ఆహార పదార్థాలలో కొన్ని రకాల ఆహార పదార్థాలు అధిక రక్త పోటుకు కారణం అవుతుంటాయి. అయితే కొన్ని ఆహార పదార్థాలు రక్తపోటును బాగా నియంత్రిస్తాయి. రక్తపోటును తగ్గించుకునేందుకు క్రమం తప్పకుండా తీసుకోవాల్సిన  బెస్ట్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


బెర్రీస్ :
బ్లూ బెర్రీస్ - రాస్బెర్రీస్ - స్ట్రాబెర్రీస్ లో అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. మరియు రక్త పోటు నియంత్రణలో ఉంటుంది.
ఆలీవ్ ఆయిల్ :
హెల్తీ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆలివ్ ఆయిల్  తీసుకోవడం వల్ల గుండె పనితీరు ఎంతో మెరుగవుతుంది.
ఫ్యాటీ ఫిష్ :
ఫ్యాటి ఫిష్ అంటే సాల్మన్ - ట్యూనా ఫ్యాటీ ఫిష్ ల‌లో ఒమేగా 3 , ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి . దీని వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
యోగ‌ర్ట్ :
యోగర్ట్ అంటే పొటాషియం - కాల్షియం .. మరియు మెగ్నీషియం అధికంగా ఉండే యోగర్ట్‌ తీసుకోవడం వల్ల ర‌క్త‌పోటు నియంత్రణలో ఉంటుంది.


ఆకుకూర‌లు :
స్పినాచ్‌, లీచ్‌, క్యాబేజీ వంటి ఆకుకూర‌ల్లో పొటాషియం, కాల్షీయం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. దీని వ‌ల్ల ర‌క్త‌పోటు నియంత్ర‌ణ‌లో ఉంటుంది.
ప‌సుపు :
ప‌సుపులో క‌ర్య్కూమ్ అధికంగా ఉంటుంది. దీని వ‌ల్ల యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువుగా ఉండి.. ర‌క్త‌పోటు నియంత్ర‌ణ‌లో ఉంటుంది.
బాదం & వాల్ న‌ట్స్ :
బాదం, వాల్ న‌ట్స్‌లో హెల్తీ ఫ్యాట్స్‌, మెగ్నీషియం, పొటాష్ అధికంగా ఉంటాయి. దీని వ‌ల్ల ర‌క్త‌పోటు కంట్రోల్లో ఉంటుంది.
ఓట్ మీల్ :
ఫైబ‌ర్ అధికంగా ఉండే ఓల్ మీట్ తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: