గుండెలోని రక్త నాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అయితే, ఈ గుండెపోటు వచ్చినప్పుడు ఆ వ్యక్తి తీవ్రమైన ఛాతి నొప్పి, వెన్ను నొప్పిని అనుభవిస్తాడని.. ఈరోజుల్లో ఏ వయసు వారికైనా ఇలా వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు. గుండెపోటు వచ్చే కొన్ని గంటల ముందే శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. అలా వచ్చే మార్పులను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఆ లక్షణాలు ఏంటో చూద్దాం. హాట్ ఎటాక్ వచ్చే గంట ముందే ఛాతిలో నొప్పి మొదలవుతుంది.
శరీరం అంతా అకస్మాత్తుగా ఒత్తిడికి లోనైనట్లు అనిపిస్తుంది. ఎలా అనిపించినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. గుండెపోటు వచ్చే ముందు ఎడమ భుజం, మెడ వెనుక భాగంలో విపరీతమైన నొప్పి మొదలవుతుంది. తరువాత దవడ, కుడి చేతి వరకు ఈ నొప్పి కలుగుతుంది. ఆ వెంటనే చమటలు పట్టడం ప్రారంభమవుతుంది. ఈ లక్షణాన్ని అసలు నిర్లక్ష్యం చేయకూడదు. అకస్మాత్తుగా మైకం రావడం, ఏ పని చెయ్యకుండానే శరీరం అంతా అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది కలగడం, ఇటువంటివి లక్షణాలు తరచుగా కనిపిస్తున్నప్పడు వైద్యుడిని సంప్రదించాలి. అయితే, హార్ట్ ఎటాక్ వచ్చే ముందు ఈ లక్షణాలు మీలో కనిపిస్తే, వెంటనే డాక్టర్లను సంప్రదించడం మంచిది.