పెళ్లికూతుర్లు ఎప్పుడూ కూడా బ్రైడల్ మేకప్ నే వేసుకుంటారు. పెళ్లికూతుర్లు బ్రైడల్ మేకప్ లో చాలా అందంగా కూడా కనిపిస్తారు. ఈ బ్రైడల్ మేకప్ ధరలు మరింతగా పెరిగిపోతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బ్రైడల్ మేకప్ ని మానడం లేదు. మానకపోవటం వల్ల ధరలు కూడా పెరుగుతున్నాయి. పెళ్లంటే తప్పట్లు తాళాలు మాత్రమే కాదు, ఈరోజుల్లో అది ఫ్యాషన్లు,డాన్సింగ్ లు, మేకప్ లు కూడాను. ఇక్కడ ఆధునిక హంగులు, సాంప్రదాయాల మేళవింపులు కూడా ఉంటున్నాయి. ముహూర్తం ఫిక్స్ అయిందంటే చాలు, వధు పరులు, వారి కుటుంబ సభ్యులు జరగబోయే వేడుకను ఎలా సెలబ్రేట్ చేయాలని కానీ గురించే ఆలోచిస్తుంటారు. పేద, ధనిక తేడా లేకుండా ఉన్నంతలో గ్రాండ్గా చేయాలని కలలు కంటారు. ఈ నేపథ్యంలో నవంబర్, డిసెంబర్ నెలలో పెళ్లి ముహూర్తాలు కూడా ఉండటంతో ' బ్రైడల్ మేకప్ ' ట్రెండ్ ప్రస్తుతం తెరమీదకు వచ్చింది. పెళ్లిరోజు ఎలా రెడీ అవ్వాలి?

 ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి? ఏ మేకప్ సెట్ అవుతుంది? అనే విషయాలన్నీ ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో పెళ్లికూతురు ముస్తాబు కూడా ఇప్పుడోక ఉపాధి పరిశ్రమగా మారుతోంది అంటున్నారు నిపుణులు. పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుంచి వధూవరుల ఆనందానికి అంతు ఉండదని చెప్పారు. ఇటు అమ్మాయి, అటు అబ్బాయి ఆరోజు ఎలాంటి దుస్తులు వేసుకోవాలి? ఎక్కడ షాపింగ్ చేయాలి? అని ఆలోచిస్తున్నారు. పెళ్లి కొడుకు, పెళ్లికూతురు వారి కుటుంబాలు ఓవైపు సంప్రదాయాలను, మరోవైపు ఆధునిక పోకడలను దృష్టిలో పెట్టుకునే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితులు ఉంటున్నాయి. ముఖ్యంగా అలంకరణ ఎలా ఉండాలనేది కూడా వధూవరులు ముందుగానే ఓ నిర్ణయానికి రావాలని భావిస్తున్నారు.

పెళ్లి పందిట్లో అటు సాంప్రదాయం, ఇటు ట్రెండ్ స్టయిల్ ను బ్యాలెన్స్ చేయాలని భావిస్తుంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ్టి పెళ్లిళ్లు అలంకరణలు, ఆధునిక, సాంప్రదాయాల కొత్త కలయికతో ఆట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మారుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం బ్రైడల్ మేకప్ ప్రాధాన్యత పెరుగుతుంది. డాన్సింగ్, మేకప్ పై వంటి విషయాలపై యువతలు ఫోకస్ పెడుతున్నారు. కొందరు ఓన్ గా మేకప్ ప్లాన్ చేసుకుంటుంటే... మరి కొందరు, బ్యూటీషియన్లను, ఫ్యాషన్ డిజైనర్ లను సంప్రదిస్తుంటారు. పెళ్లికూతురును చెప్పినప్పటి నుంచి పిఠల మీదకు చేరేవరకు ఏం చేయాలనే విషయంలో ముందుగానే ఓ క్లారిటీకి వస్తారు. తమకు సెట్ అయ్యే కలర్ చీరలు, డ్రెస్సులు, వాటికి మ్యాచ్ అయ్యే ఆభరణాలు, అలాగే మెహందీ డిజైన్లు, కాళ్లకు పారాణి... ఇలా అనేక విషయాల్లో వధువు అలంకరణకే ఇప్పుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఈ క్రమంలో కొన్ని జాగ్రత్తలు ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. పెళ్లిరోజు తాము అందంగా కనిపించాలని, ఫోటోల్లో చక్కగా రావాలని ప్రతి పెళ్లికూతురు భావిస్తుంది. ఇక ఇటీవల చాలామంది యువతలు పెళ్లి తేదీ సమీపిస్తున్న క్రమంలో తమ అందం పెంచుకోవడానికి ఏ క్రీములు వాడాలి? ఎటువంటి లోషన్లు బెటర్ అని కూడా గూగుల్ సెర్చ్ చేస్తుంటారట.

మరింత సమాచారం తెలుసుకోండి: