జీవితంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే మంత్లీ 1% నుంచి 5% వరకైనా సరే వచ్చే ఆదాయంలోంచి కొంత భాగాన్ని సేవ్ చెయ్యాలంటున్నారు నిపుణులు. అలాంటి మరికొన్ని మనీ సేవింగ్ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజుల్లో డెబిట్, క్రెబిట్, క్రెడిట్, ఫోన్ పే, గూగుల్ పే వంటివి ఆన్ లైన్ చెల్లింపులు పెరుగుతున్నాయి. చాలామంది నగదుకు బదులుగా వాటినే ఉపయోగించేందుకు ఇష్టపడుతున్నారు. అయితే కార్డులను ఉపయోగించడం వల్ల మీరు సాధారణం కంటే ఎక్కువ డబ్బును ఖర్చు చేస్తారని నిపుణులు అంటున్నారు.
ఎందుకంటే మీ కార్డులో నుంచి ఎంత డబ్బు బయటకు వెళ్తుందో పట్టించుకోరు. అదే నగదు మాత్రమే ఉపయోగించినట్లయితే... మీ చేతిలో ఎంత నగదు ఉందో.. ఎంత ఖర్చు చెయ్యాలో జాగ్రత్తగా ఆలోచించేలా చేస్తుంది. దీంతో మీరు మితంగా ఖర్చు చేస్తారు. అలా మీ డబ్బు సేవ్ అవుతుంది అంటున్నారు నిపుణులు. ప్రతి ఒకరికి ఏదో ఒక సందర్భంలో అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తవచ్చు. అలాంటప్పుడు మీ చేతిలో ఎంతో కొంత డబ్బు ఉంటే ధైర్యం ఉంటుంది. అందుకే ప్రతి ఒకరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కొంత డబ్బును ఎమర్జెన్సీ ఫండ్ కింద సేవ్ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.