అంతేకాదు మందారం ఉండే గుణాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వీటితో స్క్రబ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా పువ్వులను ఎండబెట్టి పొడి చేసి, మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో 1 టీస్పూన్ పెరుగు, అర టీస్పూన్ రోజ్ వాటర్ కలిపి పేస్టులా చేసుకుని ముఖంపై రాసుకోవాలి. 15 కూడానిమిషాల తరువాత నీటితో కడగాలి. దీంతో చర్మం మెరుస్తుంది. తదుపరి రెండు లేదా మూడు మందార పువ్వులను నీటిలో 1-2 గంటల నానబెట్టుకోవాలి.
ఒక గిన్నెలో 1 స్పూన్ బియ్యం పిండి, 1 మొక్కజొన్న పిండి, కొంచెం తేనె వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో నానబెట్టి ఉంచిన మందారా నీళ్లను గిన్నెలో పోసి, ఐస్ క్యూబ్ ప్లేట్ లో వేసుకొని ఫ్రిజ్ చెయ్యాలి. ఈ ఐస్ క్యూబ్ ను ప్రతిరోజు మీ ముఖంపై అప్లై చేయడం వల్ల మీ ముఖం గ్లో అవుతుంది. ఇది ముఖంపై ఉన్న మొటిమలు కూడా తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి. మందారం అలోవెరా జల్ ఫేస్ ప్యాక్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. రెండు మందార పువ్వులను మెత్తగా గ్రైండ్ చేసుకుని, అందులో కలబంద జల్లును కలిపి ఫేస్ కి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ని తప్పకుండా వేసుకుంటే మీ చర్మం అందంగా కనిపిస్తుంది.