నచ్చిన వారికి మెసేజ్ చేయడం ఇక స్నేహితులందరినీ కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేసి గ్రూప్ చాటింగ్లు చేయడం చేస్తూ ఉన్నారు. కానీ ఇకనుంచి గ్రూప్ చాటింగ్ చేయడం కుదరదు. ఎందుకంటే గ్రూప్ క్రియేట్ చేయాలి అంటే తప్పకుండా డబ్బులు చెల్లించాల్సిందే. వామ్మో..ఇప్పుడు ఎలా అని అనుకుంటున్నారు కదా. అంతలా కంగారు పడకండి ఈ నిబంధన మన దగ్గర కాదు జింబాబ్వేలో. అక్కడి ప్రభుత్వం కొత్త నిబంధనను అమలు చేసింది. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లందరూ జింబాబ్వే పోస్ట్, టెలి కమ్యూనికేషన్ రెగ్యులేటరీ అథారిటీలో గ్రూప్ క్రియేట్ చేసే ముందు నమోదు చేసుకోవాలి. అంతేకాదు గ్రూప్ క్రియేట్ చేయడానికి లైసెన్స్ కూడా పొందాలి. ఈ లైసెన్స్ కోసం డబ్బు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఎంత అంటే 50 డాలర్లు. అంటే సుమారు భారత కరెన్సీలో 4220 రూపాయలు చెల్లించాలి. ఈ విషయాన్ని జింబాబ్వే సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీ పోస్టల్ కొరియర్ సర్వీసెస్ మంత్రి తటెండ మాటివేరా ప్రకటించారు. తప్పుడు వార్తలు తప్పుడు పోస్టులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు.. దేశంలో శాంతి భద్రతలకు ఎలాంటి అగాతం కలవకుండా ఉండేందుకే ఈ కొత్త నిబంధనలను రూపొందించినట్టు ఆయన చెప్పుకొచ్చారు. అయితే తప్పుడు సమాచారం మూలాలను ట్రాక్ చేయడానికి.. ఇలా గ్రూప్ అడ్మిన్లు తీసుకున్న లైసెన్స్ ఉపయోగపడుతుందని మంత్రి చెప్పుకొచ్చారు.