ఇంటిదగ్గర పెంచకూడని చెట్లలో గన్నేరు చెట్టు కూడా ఒకటి.. ఇది చెడు ఎక్కువగా ఉంటుందట. ఈ చెట్టుకు పూసేటువంటి పూలు అందంగా ఉన్నప్పటికీ పూజకు ఉపయోగపడుతున్నప్పటికీ ఈ చెట్టుకు ఉండే ఆకులలో రసాయనాలు మంచివి కాదని నిపుణులు తెలియజేస్తున్నారు.
చాలామంది ఇళ్లల్లో ఉండేటువంటి మొక్క కలబంద. ఈ మొక్క అందాన్ని పెంచడానికి ఆరోగ్యాన్ని కాపాడడానికి కూడా ఉపయోగపడుతుంది అయితే దీని వల్ల లాభాలతో ఇంట్లో చాలామంది పెంచుకుంటూ ఉంటారు. ఈ మొక్కలను సైతం పెంచడం వల్ల జంతువులకు చాలా సమస్యలు ఏర్పడతాయట.
జిల్లేడు పూల చూడడానికి అందంగా పీస్ ఫుల్ గా ఉన్నప్పటికీ ఈ మొక్క పువ్వులను పూజ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ మొక్క ఇంట్లో ఉండడం కూడా చాలా ప్రతికూల శక్తికి ప్రభావాన్ని చేస్తుందట ఈ కుటుంబానికి కూడా హానికరం అయ్యేలా చేస్తుందట. జిల్లేడు చెట్టులో ఒక ద్రవపదార్థం ఉంటుంది ఇది ఆరోగ్యాన్ని కూడా పాడు చేసేలా చేస్తుందట.
బాదం చెట్టుని ఇంటి దగ్గర ఉంచుకుంటే బాధలు ఎక్కువగా వస్తాయని మన పూర్వీకులు సైతం తెలియజేస్తూ ఉంటారు. అందుకే బాదం చెట్టుని సరిత ఎవరు కూడా ఇంటిదగ్గర నాటుకోకపోవడం మంచిది.
మరి కొంతమంది పత్తి ఆకు చెట్టుని ఇంటి దగ్గర పెంచుతూ ఉంటారు. ఇలా పెంచడం కూడా నష్టమేనట ఎందుకంటే పత్తి మొక్క నాటితే ఆర్థిక సంక్షేమం ఉంటుందట. దీంతో ఆ ఇంటికి ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుందట.