అయితే, జీవితంలో ఎదురయ్యే సమస్యలు.. వాటిని ఎలా అధిగమించాలని కసిని పెంచుతాయి. ప్రాథమిక దశలోని కష్టాలను ఎదుర్కొన్నట్లైతే, ఆ తరువాత వచ్చే ఎటువంటి సమస్యలైనా ఆత్మవిశ్వాసంతో సులువుగా అధిగమిస్తారు. సమస్యలు ఎదురైనప్పుడు, మనకు మద్దతుగా ఎవరు ఉంటారో అనేది స్పష్టంగా అర్థంమవుతుంది. ప్రతి కష్టం వెనుక ఒక కారణం ఉంటుంది. దీనిని ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తే, విజయం వైపు అడుగులు పడినట్లే. కష్టానికి తగ్గ ఫలితం అని పెద్దలు అంటుంటారు. జీవితంలో మొదట కష్టాలను ఎదుర్కొన్న చాలామంది ఉన్నంత శిఖరాలకు చేరుకున్నారు.
ఆత్మవిశ్వాసం మొండుగా ఉంటే.. జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించే నేర్పరి తనం పెరుగుతుంది. ఓటమి మనిషికి గుణపాఠంతో పాటుగా భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలని అనుభవాన్ని నేర్పుతుంది. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఓటమి ఎదురవడం సహజమే. పరీక్షల్లో ఫెయిల్ అవడం, వ్యాపారంలో నష్టం, ఉద్యోగం కోల్పోవడమో, ఇలా జీవితంలో కొన్ని సందర్భాల్లో ఓటమి ఎదురవుతుంది. అలాంటి సమయంలోనే ఒక్కసారి ఆ సమస్యను మరో కోణం నుంచి పరిష్కరించే మార్గాన్ని వెతికేలా చేస్తుంది. భవిష్యత్తులో మళ్లీ ఓటమి ఎదురైతే, దానిని సులువుగా పరిష్కరించే ఆలోచనలను కలిగిస్తుంది.