క్రమంగా అది హెల్త్ పై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెప్తున్నారు. అలాగే సున్నితమైన చర్మాతత్వం కలిగిన వారు జీన్స్ ధరించి పడుకోవడం వల్ల చర్మంపై దద్దుర్లు రావచ్చు. కాబట్టి అలాంటి సమస్యలు ఎదురవుతున్నట్లయితే వీరు ధరించే జీన్స్ కూడా కారణమేమో పరిశీలించుకోండి. బిగుతుగా ఉండే జీన్స్ ధరించి నిద్రపోవటం వల్ల చర్మం రాపిడికి గురవుతుంది. తొడల మధ్య తేమ ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా పెరిగే ఛాన్స్ ఉంటుందని చర్మ వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా స్కిన్ ఇన్ఫెక్షన్లు, తద్వారా అలర్జీలు, దురద, చిరాకు వంటివి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చర్మానికి గట్టిగా అతుక్కుని ఉండటం వల్ల బిగుతైన జీన్స్ ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా రక్త ప్రసరణకు ఆటంకం కలిగించవచ్చు.
దీంతో శరీరంలోని అవయవాలకు సరైన సమయంలో, సరైన విధంగా బ్లడ్ సరఫరా కాకపోవటం కారణంగా మొత్తం శరీర పనితీరులో మార్పు వస్తుంది. అలాగే జీన్స్ ధరించి పడుకోవడం వల్ల బాడీలో ఫిట్ కూడా పెరుగుతుంది. ఇవన్నీ తర్వాత మీ రోజువారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. జీన్స్ ప్యాంట్లు ధరించి పడుకున్నప్పుడు శరీర కదలికలు అసౌకర్యం ఏర్పడుతుంది. దీంతో ఒత్తిడి పెరుగుతుంది. పేగు కదలికలు కూడా సక్రమంగా లేకపోవడంతో జీర్ణ క్రియపై ప్రభావం పడుతుంది. దీంతో కడుపులో ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే జీన్స్ కు ఉండే బటన్స్ కడుపుపై, నడుము పై రాసుకుపోవటం వల్ల ర్యాషెస్ ఏర్పడతాయి. స్టైలిష్ కోసం జీన్స్ వేసుకోవచ్చు. కానీ నిద్రపోయే ముందు మాత్రం కంఫర్టబుల్ క్లాత్స్ ధరించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. స్కిల్క్, కాటన్ వంటి శరీరానికి గాలి తగిలేందుకు భయపడే దుస్తులు ఎంచుకోండి. అలాగే అవి టైట్ గా కాకుండా, వదులుగా, సౌకర్యంగా ఉండేలా చూసుకోవటం మంచిది. దీంతో రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది.