పిల్లలకు రోజూ ఎలాంటి ఆహారం ఇవ్వాలో ఇక్కడ చూద్దాం. పిల్లలకు పెరుగు తినిపిస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇది ప్రోబయోటిక్ అవసరాలను తీరుస్తుంది. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా పిల్లలను చురుగ్గా ఉంచేందుకు సహాయపడుతుంది. ఈ బ్యాక్టీరియా జీవక్రియను వేగవంతం చేస్తుంది. దీనివల్ల అజీర్తి సమస్యలు తగ్గుతాయి. పెరుగులో కాల్షియం, ఫాస్పరస్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇది మెదడు, గుండెకు ప్రయోజనం చేకూర్చి, ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
పిల్లలకు పెరుగును క్రమం తప్పకుండా తినిపించడం వల్ల సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని నిపుణులు అభిప్రాయం. ఇవి పిల్లల మెదడును చురుకుగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా శరీర అవయవాలు క్రమంగా పనిచేయడానికి తోడ్పడుతుంది. వాల్ నట్స్, అవిసె గింజలు, గుడ్లు, చేపలు, ఆకుకూరలు, కూరగాయలలో ఒమేగా -3 పుష్కలంగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ లో ఉండే ఫ్యాటి యాసిడ్స్ పిల్లల మెదడును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మొలకలలో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఉదయం, సాయంత్రం పిల్లలకు తినిపిస్తే, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.