దీనివల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఇంట్లోనే సింపుల్ గా వర్కౌట్ చేయడం వల్ల కండరాలు పెరుగుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మార్నింగ్ ఎక్సెస్ సైజ్ లు చేస్తున్నప్పుడు 15 నుంచి 20 స్క్వాట్స్ చెయ్యాలి. ప్రతిరోజు ఇలా చేయటం వల్ల కండరాలు బాగా పెరుగుతాయి. స్క్వాట్స్ చేసేందుకు ముందుగా నడుమును వంచి కుర్చీలో కూర్చున్నట్లుగా చేయాలి. కాళ్లపై భారం వేస్తూ.. నడుమును వంచి గాల్లో కూర్చోవాలి. ఇలా రోజుకు 20 స్క్వాట్స్ చెయ్యాలి. ఎవరైనా ఇది చేయవచ్చు. దీనిని చేయటం వల్ల కండరాలు దృఢంగా మారడే కాకుండా... బాడీ షేప్ అందంగా మారుతుంది.
నడుము కింద ఉన్న క్యాలరీలు బర్న్ చేయటంలో ఈ వ్యాయామం ఉత్తమంతా పనిచేస్తుంది. ముందుగా ఏదో ఒక కాలితో ముందుకు అడుగు వెయ్యాలి. ఆ తర్వాత చాపిని కాళ్లును వంచి 90 డిగ్రిల కోణంలో నేలకు తాకించాలి. ఇలా రెండు కాళ్లతో రిపీట్ చేస్తుండాలి. ఇలా 15 లంజెస్ చేయాలి. ఇది చేసేందుకు సింపుల్గా ఉన్న, శరీరంలోని కండరాలు బలంగా మారడమే కాకుండా.. కండరాలు వ్యాకోచించేందుకు తోడ్పడుతుంది. ఎక్కువగా కష్టపడి చేసే వర్కౌట్స్ లో ప్లాంక్ ఒకటి. ప్రతిరోజు ఈ వ్యాయామం చేయటం వల్ల చాలా వరకు బెల్లి ఫ్యాట్ తగ్గుతుంది.