అవసరం ఉన్నా లేకపోయినా ఏ డ్రెస్ మీద అయినా బెల్ట్ పెట్టుకుంటున్నారు. పురుషులతో పాటుగా స్త్రీలు కూడా వీటిని ధరిస్తున్నారు. కొందరు బెల్ట్ లేకుండా జీన్స్, ఫార్మల్ ప్యాంట్లు ధరిస్తారు. మరికొందరు ప్యాంట్ ఫిట్టింగ్ కోసం బెల్ట్ వాడుతుంటారు. మీకు బెల్ట్ పెట్టుకుని అలవాటు ఉంటే, ఆ అలవాటును తప్పనిసరిగా మార్చుకోండి. ఎందుకంటే దీనివలన చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి బెల్ట్ ఆస్తమానం పెట్టుకోవడం మంచిది కాదు. కొందరు నడుము దగ్గర చాలా ఫీడ్గా పెట్టే ప్యాంటును వాడుతుంటారు. అవసరం లేకున్నా కానీ బెల్ట్ పెట్టుకుంటారు.
ఇలా పెట్టుకోవడం వల్ల నడుము, పొత్తికడుపులో తిమ్మిరి కలుగుతుంది. ఫిట్గా బెల్ట్ పెట్టుకోవడం వల్ల పొట్టపై ఒత్తిడి కలిగిస్తుంది. దీనివల్ల పొట్టలోని అమ్లం గొంతులోకి చేరి, కొన్నిసార్లు ఎసిడిటీ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అమ్మాయిలు కూడా నడుము దగ్గర టైట్ గా ఉన్న ప్యాంట్ వేసుకున్న లేదా టైట్ గా ఉండే బెల్ట్ పెట్టుకున్న పొట్టపై ఒత్తిడి పెరిగి.. వెన్ను నొప్పి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా నరాల సమస్యతో పాటుగా గుండెలో మంట, యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువ కావచ్చు. కాబట్టి అవసరం అయినప్పుడు మాత్రమే బెల్టుని ఉపయోగించండి. బెల్టును ఎక్కువగా ఉపయోగించటం వల్ల అనేక సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.