పిల్లలకు సరైన నిద్ర లేకపోతే శరీరంలో మార్పులు, మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతోందని వెల్లడించింది. పిల్లలకు సరైన నిద్ర ఎంతో అవసరం. ఇది వారి మెదడు పనితీరును వృద్ధి చేస్తుంది. ఏదైనా విషయాలు నేర్చుకునేందుకు, జ్ఞాపక శక్తికి అవసరమైన నాడి విధానాన్ని అభివృద్ధి చేయడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. సరైన నిద్ర లేకపోవడం వల్ల జ్ఞాపక శక్తి పై ప్రభావం చూపే అవకాశం ఉందని అధ్యాయనాలు తెలియజేశాయి. అయితే, పిల్లలు, పెద్దల్లో నిద్ర పాత్ర వేరువేరుగా ఉంటుందని, దీని ప్రభావాలు ఒకేలా ఉండవని తెలిపింది. పెద్దలకు అవయవాల విశ్రాంతికి నిద్ర అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అయితే, ఇది పిల్లల విషయంలో భిన్నంగా ఉంటుంది.
పిల్లలకు సరైన నిద్ర వారి మెదడు, జ్ఞాపక శక్తి పెరగటంలో కీలక పాత్ర పోషిస్తుంది. పిల్లల మెదడు అభివృద్ధికి, న్యూరాన్లు కనెక్షన్లకు నిద్ర ఉపయోగపడుతుంది. ఒకవేళ నిద్రలో ఆటంకాలు కలిగితే, ఆ ప్రభావం పెద్దల కంటే పిల్లలపై ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు నిద్రకు ఒక నిర్ధిష్టమైన షెడ్యూల్ పెట్టుకుని, వారి నిద్రకు భంగం కలగకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా రోజు సరైన టైమ్ లో నిద్రపోవటం వారికి అలవాటు చేయటం వల్ల మెదడు పనితీరుపై ఎటువంటి దుష్ప్రభావాలు పడకుండా ఉంటాయి. సరైన నిద్ర లేకపోతే మెదడులోని కొన్ని రకాల హార్మోన్లు ప్రభావితమవుతాయి. దీనివల్ల జ్ఞాపకశక్తి, నేర్చుకునే గుణంతో సహా కొన్ని కీలకమైన హార్మోన్లపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.