చిన్నపిల్లలు ఇప్పుడే నేర్చుకుంటారు, పెద్దవాళ్లు అయితే వాళ్లకు అర్థమవుతుంది అని. కానీ, అది చాలా తప్పని చెబుతున్నారు. మరి పిల్లలకు నేర్పించాల్సిన విషయాలు ఏమిటో చూద్దాం. పదేళ్ల లోపు పిల్లలకు మైండ్ చాలా షార్ప్ గా పనిచేస్తుంది. ఈ వయసులోనే వారు ఎక్కువగా నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అందుకే చిన్న వయసు నుంచే పిల్లలకు మంచి అలవాట్లను నేర్పించాలి. లేదంటే... వాళ్లు పెద్దయ్యాక ఏదైనా కొత్త విషయం నేర్చుకోవటం లేదా చెప్పిన విషయాన్ని వినటం వారికి కష్టంగా ఉంటుంది.
పిల్లల వయసుకు తగిన కొన్ని సవాళ్లు, పజిల్స్ వంటివి వారికి ఎదురయ్యేలా చేయండి. దీని ద్వారా వారు ఆ సమస్య పరిష్కార నైపుణ్యాలను నేర్చుకుంటారు. ఇలా చేయటం వల్ల వాళ్లు పెద్దవాళ్ళు అయ్యాక సులభంగా సమస్యను పరిష్కరించడం నేర్చుకుంటారు. పిల్లలు వారి ఆలోచనలను స్పష్టంగా తెలియజేయడం నేర్పించాలి. ఎటువంటి విషయాన్ని అయినా పేరెంట్స్ తో చెప్పడం అలవాటు చేసేలా చేయాలి. పరీక్షల్లో ఫెయిల్ అయిన, ఆటల్లో ఓడిపోయిన వారిని ఉత్సాహపరచండి. ఇది జీవితంలో ఒక భాగం మాత్రమే అని వారికి అర్థమయ్యేలా చేయండి. అన్నిటిలోనూ విజయం సాధించాలని అనుకుంటారు. చిన్నప్పటి నుంచే తమ పిల్లల జీవితం అలా ఉండాలి ఇలా ఉండాలని ఆలోచిస్తుంటారు.