అయితే, ఈ గుర్తులను ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా? ఇక్కడ అన్ని రంగులకు వేర్వేరు అర్థాలు ఉంటాయి. దీనికి సంబంధించి జనాలకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. టూత్‌పేస్ట్ ట్యూబ్‌పై గల వేర్వేరు రంగులలో ఎరుపు, ఆకుపచ్చ, నలుపు మరియు నీలం రంగులతో వేసిన చారల గుర్తులు ఉంటాయి. టూత్‌పేస్ట్ ట్యూబ్‌పై నీలిరంగు గీత అంటే అది 'మెడికేటెడ్ టూత్‌పేస్ట్' అని, 'ఆకుపచ్చ' గుర్తు ఉంటె ఇది పూర్తిగా సహజమైనదని, ఆరోగ్యానికి మేలు చేస్తుందని, అదేవిధంగా రెడ్ స్ట్రిప్ స్టెయిన్ అంటే నేచురల్ మరియు కెమికల్ మిశ్రమం అని, ఇక బ్లాక్ స్ట్రిప్ అంటే ఫుల్ కెమికల్ అని మనం ఇప్పటి వరకు అర్థం చేసుకున్నాం.
కానీ ఇది పూర్తిగా తప్పుడు సమాచారం అని చెబుతున్నారు పలువురు నిపుణులు. సైంటిఫిక్ అమెరికన్ అనే వెబ్‌సైట్ ప్రకారం, ప్రపంచంలోని ప్రతిదీ సాంకేతికంగా రసాయనికమైనదనే అర్ధం చేసుకోవాలి. అందుకే రసాయన లేదా రసాయన రహిత ఉత్పత్తులు అనే తారతమ్యం అనేది ఉండదనే చెప్పుకోవాలి. వాస్తవం ఏమిటంటే, టూత్‌పేస్ట్ ట్యూబ్‌లపై రంగుల చారలు అనేవి వినియోగదారులకు వేసివి కాదు. నిజానికి, టూత్ పేస్ట్ ట్యూబ్ మేకింగ్ మెషీన్‌లో ఇన్‌స్టాల్ చేయబడిన లైట్ సెన్సార్‌లకు ఏ రకం పరిమాణంలో ట్యూబ్ తయారు చేయాలో అవి సూచిస్తాయట. కేవలం కాంతి సెన్సార్లు మాత్రమే వాటిని అర్థం చేసుకోగలవట. ట్యూబ్‌లో పేస్ట్ ఎంత దూరం నింపబడుతుందో సూచించడానికి వివిధ రంగులు ఉపయోగించబడతాయి అని సదరు వెబ్ సైట్ పేర్కొంది. ఆ రంగును చూడటం ద్వారా, ట్యూబ్‌లోని ఏ భాగాన్ని సీల్ చేయాలో యంత్రానికి తెలుస్తుంది. ఇది ప్యాకేజింగ్ పనిని సులభతరం చేస్తుంది. అదన్నమాట అసలు విషయం!