ఇక అసలు విషయంలోకి వెళితే, మహిళలు జడ వేసుకుంటే చాలా మంచిది అయినప్పటికీ, కొన్ని రకాల జడలు వేసుకోకపోవడమే ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు కొంతమంది సూచిస్తున్నారు. వాటిలో ముఖ్యమైనది.. పోనీ టైల్. పోనీ టైల్ వంటి జడని వేసుకున్నప్పుడు చాలావరకు అమ్మాయిలు చాలా బిగుతుగా జడను ముడివేసుకోవడం జరుగుతుంది. కానీ అది ఎంతమాత్రమూ మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అలా వెంట్రుకలను గట్టిగా ముడి వేసినపుడు ఆ ప్రభావం నుదిటి నరాలమీద పడి మైగ్రేన్ వంటి తలనొప్పులకు దారితీస్తుందని అంటున్నారు.
ఇక అప్పట్లో స్త్రీలు జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరిగితే దరిద్రమని.. జేష్టాదేవికి చిహ్నమని భావించేవారు. అందుకే దాదాపుగా అప్పటి స్త్రీలు అందరూ జడలు వేసుకునేవారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు మహిళలు వయసుతో సంబంధం లేకుండా జడ వేసుకునేవారు. అయితే ఇది కాలక్రమేణా మారుతూ వస్తోంది. ఇప్పుడు సంప్రదాయాలకంటే అధునూతన వెసులుబాట్లకే యువత ఎక్కువ మొగ్గు చూపుతుంది. అయితే జుట్టుని జడగా వేసుకోవడం ఉత్తమమైనదేనని, అయితే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని జుట్టుని ముడి వేసుకుంటే ఉత్తమం అని అంటున్నారు.