వారు పొరపాటున కూడా దీనిని తినకూడదు. ఇందులో లెక్టిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది కొంతమందికి ఎలర్జీని అందిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. జీర్ణ సమస్యలు ఉన్నవారు ఈ బెండకాయను తినక పోవటమే మంచిది. మలబద్ధకం, చిరాకు, కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు దీనిని తినకూడదు. ఒకవేళ తిన్నట్లయితే ఈ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. ఎలర్జీ ఉన్నవారు బెండకాయను అసలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ దీనిని తిన్నట్లయితే దురద, బొబ్బలు, దద్దుర్లు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి బెండకాయ మంచి ప్రయోజనాలను కలిగిస్తుంది. ఎందుకంటే ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంతరిస్తుంది.
కానీ, డయాబెటిస్ ను కంట్రోల్ చేయడానికి మందులు వాడుతున్న వారు మాత్రం దీనిని అస్సలు తినకూడదు. ఒకవేళ తినాలని అనుకుంటే వైద్యుడిని సంప్రదించండి. బెండకాయను కొంతమంది పచ్చిగా తినడానికి ఇష్టపడుతుంటారు. కానీ, కిడ్నీ సమస్యలు, జలుబు ఉన్నవారు బెండకాయ తినక పోవటమే మంచిది. ఎందుకంటే ఇందులో కాల్షియం ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లు సమస్యను పెంచుతుంది. బెండకాయలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఫోలెట్, విటమిన్ కె, మెగ్నీషియం, విటమిన్ బి6 లు పుష్కలంగా ఉంటాయి. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. బెండకాయ లో ఉండే ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాలను తగ్గిస్తుంది.