ముల్లంగి ఆరోగ్యానికి చాలా మంచిది. ముల్లంగిని చాలామంది ఎక్కువగా ఇష్టపడతారు. మరి కొంతమందికి మాత్రం ముల్లంగి అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఈ కూరగాయను, దీని ఆకులను ఏం చేస్తారో తెలిసిందే. కొందరు కూరగా వండుకుని తింటే.. మరికొందరు పచ్చిగాను తింటుంటారు. అయితే ఒక దేశంలో మాత్రం దీనితో పెద్ద వేడుకే జరుపుకుంటారు. అందుకోసం ప్రజలు మేలైన, తాజా ముల్లంగిని సేకరిస్తారు. అందరూ ఒకచోటకు చేరి ఆనందోత్సహాల మధ్య ముల్లంగి వంటకాలను, కాయగూరలను, ఆకుకూరలను ప్రదర్శిస్తారు.

 ఇంతకీ ఈ ముల్లంగి సంబురం జరిగేది ఎక్కడో అనుకుంటున్నారా? మెక్సికోలోని ఓక్సాకాలో . ' లా నోచో డి రాబోనోస్' పేరిట ఏడాదికోసారి జరుపుకుంటారు. కాగా ఇక్కడ అత్యధికంగా ఎర్ర ముల్లంగినే పండిస్తారు. ప్రతి ఏడాది డిసెంబర్ వచ్చిందంటే చాలు మెక్సికో  లోని ఓక్సాకాలో ముల్లంగి సంబురాల సందడి మొదలవుతుంది. ఆరోజు ఎక్కడి రెస్టారెంట్లలో కూడా ఎక్కువగా ముల్లంగి స్పెషల్ వంటకాలే కనిపిస్తాయి. దాదాపు డిసెంబర్ 20 నుంచి 23 తేదీ వరకు ఈ వేడుక నిర్వహిస్తారు. చివరి రోజు ముఖ్యమైన పండుగా భావిస్తారు. ఎంతోమంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొనే ఏ ముల్లంగి సంబురం రోజు వివిధ కళా, సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

కాగా ఈ వేడుక కోసం రైతులు అప్పుడే నెలలో నుంచి తీసుకొచ్చిన ఎర్రటి తాజా ముల్లంగిని నీట్ గా కడిగి వేడుక కోసం రెడీ చేస్తారు. ఇక కొంతమంది కళాకారులు వీటిని నిర్ణిత మాసంలో విభిన్న డిజైన్లలో, అందమైన ఆకృతులుగా చెక్కుతారు. అలా తీర్చిదిద్దిన వాటిలో అత్యంత అట్రాక్టివ్ గా ఉండే దీనికి బహుమతులు కూడా ఇచ్చి పుచ్చుకుంటారు. ముల్లంగి సంబురం అనేది మెక్సికోలో 19వ శతాబ్దపు చివరిలో పురుడు పోసుకుందని అక్కడి సంస్కృతిక నిపుణులు చెప్తుంటారు. అప్పట్లో ఓక్సాకా పరిసర ప్రాంతాల్లో కూరగాయల సాగులో ముల్లంగికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి: