అడవిలో ఉండే అత్యంత ప్రమాదకరమైన బలమైన జంతువులలో సింహాలు మొదటి వరుసలో ఉంటాయి అన్న విషయం తెలిసిందే. సింహానికి ఒక్కసారి ఆకలి వేసిందంటే చాలు ఆరోజు ఏదో ఒక జంతువుకు మూడింది అని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు. అందుకే సింహన్ ని అడవికి రారాజుగా అభివర్ణిస్తూ ఉంటారు  అయితే సింహాలు మనుషులపై కూడా దాడి చేయడం ఇప్పటివరకు ఎన్నోసార్లు చూశాము. ఇలాంటి తరహా వీడియోలు కూడా ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయాయి.



 ఇలా సింహం కళ్ళ ముందు మనిషి కనిపించాడు అంటే చాలు ఒక్క పంజా విసిరి ఏకంగా మనిషి ప్రాణాలను తీసేస్తూ ఉంటాయి. అలాంటిది ఏకంగా ఎంతో మంది మనుషులతో సఫారీ వాహనాలు సింహాలకు దగ్గరగా వెళ్లిన కూడా దాడి చేయవు. ఎందుకు ఇలా సఫారీ వాహనాలపై సింహాలు దాడి చేయవు అన్న విషయం దాదాపుగా చాలామందికి తెలియదు. అయితే ఇలా సింహాలకు దగ్గరగా వెళ్లినప్పటికీ అవి దాడి చేయకపోవడం వెనక పెద్ద కారణమే ఉందట. సింహాలు సఫారీ వాహనాలను పెద్ద జంతువులుగా గ్రహిస్తాయట.


 ఇంకోవైపు సింహాలు అటు మనుషులను ఎరగా చూడవట. కేవలం వాటిని రెచ్చగొడితేనే దాడి చేయాలని అనుకుంటాయట. అయితే సరైన పర్యవేక్షకులు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇలా సఫారీ వాహనాలు సింహాలు ఉండే నివాసాల్లోకి వెళ్ళకూడదట.అయితే ఇలా సఫారీలను పెద్ద జంతువులుగా గ్రహించడం కారణం గానే సింహాలు వాటిపై దాడి చేయడానికి దూరంగా ఉంటాయట. ఎలాగైతే అటు పెద్ద పెద్ద ఏనుగులను పై దాడి చేయడానికి వాటి సింహాలు దూరంగా ఉంటాయో. సఫారీలపై దాడి చేయడానికి కూడా అలాగే దూరంగా ఉంటాయట. అంతేకాదు కారులో ఉండగా సింహాలు గెలిచే అవకాశాలను కూడా తూకం వేస్తాయట. అందుకనే ఇలా సఫారీ వాహనం లో సింహాలకు దగ్గరగా వెళ్లినప్పటికీ కూడా అవి దాడి చేయవట.

మరింత సమాచారం తెలుసుకోండి: