అందుకే సరైన కమ్యూనికేషన్ కలిగి ఉండాలంటున్నారు నిపుణులు. దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. చాలామంది చిన్న సమస్య అనుకుంటారు. అలాగనీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం కమ్యూనికేషన్ గ్యాప్ చివరికి పెద్ద ప్రాబ్లం గా మారవచ్చు అంటున్నారు నిపుణులు. క్రమంగా ఇది మానవ సంబంధాల పైనా, వ్యక్తిగత, కుటుంబ, వృత్తి జీవితాల పైన ప్రభావం చూపుతుంది. అందుకే దీనిని నివారించాలి అంటున్నారు మానసిక నిపుణులు. సరైన కమ్యూనికేషన్ కలిగి ఉన్నప్పుడే అనుమానాలు, సందేహాలు, మనస్ఫర్థలకు అవకాశం ఉండదు. మనసులోని ఫీలింగ్స్ బయటకు చెప్పకుండా బాధపడే పరిస్థితి ఉండదు.
అలా చేయటం వల్ల తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి కూడా రాదు. మీరు సక్సెస్ ఫుల్ వ్యక్తిగా ఉండాలంటే కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. అది ప్రయత్నించకపోతే అసలు రాదు. అవతలి వ్యక్తులే అర్థం చేసుకుంటారులే అనుకుంటే సమస్య మరింత జఠిలం కావచ్చు. ఎందుకంటే మీ మనసులో ఏముందే మీరు చెప్పకపోతే ఎవరికైనా ఎలా తెలుస్తోంది? కాబట్టి మీరేం అనుకుంటున్నారు అది చెప్పే సేయంది. సంతోషం, బాధ, సమస్య ఇలా ఏదైనా సరే బయటకు చెబితేనే కదా ఎదుటి వ్యక్తికి అర్థం అయ్యేది. కాబట్టి నీలో కమ్యూనికేషన్ గ్యాప్ లేదా కమ్యూనికేషన్ ప్రాబ్లం వంటివి గుర్తిస్తే మరు క్షణం నుంచే వాటిని దూరం చేసుకునే ప్రయత్నం చేయాలంటున్నారు నిపుణులు.