ఇందులో మాయిశ్చరైజింగ్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని ముఖానికి రాయటం వల్ల ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని కాపాడుతుంది. అయితే, ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ రెండిటిని మిక్స్ చేసి ముఖానికి రాయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఈ రెండిటిని కలిపి ఎలా ఉపయోగించాలో ఇక్కడ చూద్దాం. విటమిన్ ఇ అనేది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది పొడిబారిన చర్మాన్ని తేమగా మార్చి, స్కిన్ కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. చర్మంపై ఉన్న డెడ్ స్కిన్, మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. అంతేకాకుండా వృద్ధాప్య లక్షణాలను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. కంటి కింద నల్ల మచ్చలు ఉన్న వారికి విటమిన్ ఇ క్యాప్సిల్ ఉపయోగపడుతుంది.
ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి. ఆయిల్ స్కిన్ ఉన్నవారు రోజ్ వాటర్ ను ఉపయోగిస్తే ప్రయోజనం ఉంటుంది. అంతేకాకుండా చర్మాన్ని మృదువుగా ఉంచి, మెరిసేలా చేస్తోంది. ఇందులోని ఆస్ట్రిజెంట్ గుణాలు చర్మంపై ఉన్న రంద్రాలను ముసివేసి, స్కిన్ పై ఉన్న ముడతలను తొలగిస్తాయి. ముందుగా ఒక గిన్నెలో 2 లేదా 3 స్పూన్లు రోజ్ వాటర్ ను తీసుకొని, అందులో ఒక విటమిన్ ఇ క్యాప్యూల్ నునెను పిండి, రెండిటినీ బాగా కలుపుకోవాలి. ముందుగా మంచి నీటితో ముఖాన్ని శుభ్రంగా చేసుకోవాలి. ఆ తరువాత ఈ విశ్రమాన్ని ముఖంపై మసాజ్ చేస్తూ అప్లై చేయాలి. అలా 20 నిమిషాలు ఉంచిన తరువాత చల్లటి నీటితో కడిగేయాలి.