సాధారణంగా రక్తనాళాలు బలహీనంగా మారడం, మెదడు కణాలకు తగినంతగా ఆక్సిజన్ అందకపోవటం సమస్యల వల్ల కాళ్లు లేదా తల తిరగడం వంటివి సంభవిస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. అకస్మాత్తుగా నిద్రలేచినప్పుడు, సడన్ గా కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు గుండె శరీరంలోని అన్ని బాగాలకు బ్లడ్ పంప్ చెయ్యటంలో కష్టపడుతుంది. అంటే ఇక్కడ కదలికల సందర్భంగా మీరు ప్లేస్ మారితో రక్తపోటు కూడా సహజంగానే మారుతుందని, దీనినే హోమియో స్టాసిన్ అంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది అన్ని శారీరక వ్యవస్థలు సక్రమంగా పనిచేయటంలో సహాయపడుతుంది. ఇక మీరు అకస్మాత్తుగా బాడీ పొజిషన్స్ మార్చినప్పుడు బ్రెయిన్ చిన్నపాటి షాక్ కు గురవుతుంది. దీంతో క్షణం పాటు మెదడుకు రక్తం సర్పర ఆగిపోతుందని,
ఈ సందర్భంలోనే రక్తపోటులో హెచ్చుతగ్గులు సంభవిస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీని మూలంగానే మైకం కమ్మినట్లు అనిపించడం, కళ్ళు తిరగటం వంటివి జరగవచ్చు. అలా జరగగానే మీ బాడీని బ్యాలెన్స్ చేసుకోవటానికి కొంత సమయం ఇవ్వాలి. అందుకోసం గోడ లేదా కిటికీని పట్టుకొని నిల్చోవచ్చు. అయితే అప్పుడప్పుడు శరీరంలో పోషకాల లోపం, అధిక ఒత్తిడి, హార్మోన్ల సమస్యలు, డిహైడ్రేషన్ వంటి కారణాలతో ఇలా కళ్ళు తిరుగుతుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సమయానికి తినటం, సరిగ్గా నిద్రపోవటం, తగినంతగా నీరు తాగటం వంటి ఆరోగ్యకరమైన జీవన శైలితో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. అప్పటికి పరిష్కారం లభించకపోతే మరేదైనా ఆరోగ్య సమస్యగా అనుమానించే వైద్య నిపుణులను సంప్రదించాలి.