చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కిడ్నీలో స్టోన్స్ అనేవి వస్తున్నాయి. ఈ సమస్య మరింతగా పెరిగిపోతుంది. శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఇది రక్తాన్ని వడబోసి వ్యర్థాలను బయటకి పంపటంలో కి పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే అవి బాగున్నప్పుడే మొత్తం ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఈ మధ్య చాలా మంది కిడ్నీలో రాళ్లు సమస్యను ఎదుర్కొంటున్నారు. స్టోన్స్ చిన్నవిగా ఉన్నప్పుడు వైద్యుల సలహాతో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రాళ్లు కరిగిపోవటమో,

మూత్ర నాళం ద్వారా బయటకు వెళ్లిపోవడమో జరుగుతుంది. అయితే ఇలాంటి అప్పుడు కొన్ని ఆహారాలను తీసుకుంటే సమస్య మరింత అధికం అవుతుంది. కాబట్టి వాటిని తక్కువగా తీసుకోవటం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో చూద్దాం. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు నాన్ వెజ్ ఎక్కువగా తినకూడదు. ముఖ్యంగా చికెన్, రెడ్ మీట్ వంటివి తగ్గించాలి. ఎందుకంటే ఇవి ఎక్కువగా తినటం వల్ల యూరిక్ యాసిడ్ అధికంగా ప్రొడ్యూస్ అవుతుందని, మూత్రంలో సిట్రేట్ కెమికల్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

పొటాషియం కంటెంట్, అలాగే ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు కూడా కిడ్నీ స్టోన్స్ ఉన్న వారిలో ఆ సమస్యను మరింత అధికం చేస్తాయి.వాపు, మంటలను పెంచుతాయి. కాబట్టి ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, అరటి పండ్లు, చిలగడ దుంపలు, టమాటాలు వంటివి తగ్గించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే యాపిల్, బెర్రీలు, పైనాపిల్, పుచ్చకాయ, దాక్ష, క్యాబేజీ, బ్రోకోలి, కాలీఫ్లవర్ వంటి కూరగాయలు తినటం మంచిది. అలాగే సోడాలు, కార్బోనేటెడ్ బేవరేజ్ అధికంగా ఉండే కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువగా తాగవద్దు. ఇలా తాగటం వల్లే అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి మనం డైట్ చేయటం వల్లే ఆ కిడ్నీలో స్టోన్స్ అనేవి తగ్గుతాయి. అయితే ఇలాంటి అప్పుడు కొన్ని ఆహారాలను తీసుకుంటే సమస్య మరింత అధికం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: