జీర్ణవ్యవస్థలో గ్యాస్ అధికంగా చేరడం వల్ల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అదెలా అంటారా. ఆహారంలో ఉండే పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇది జీర్ణ క్రియ కు శక్తిని ఇచ్చి, జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. కడుపు సంబంధిత సమస్యలు మెదడుపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. పేగుల్లో ఉండే మంచి, చెడు బ్యాక్టీరియాలు పేగు ఆరోగ్యం పై ప్రభావం చూపుతాయి. ఇందులో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే... అది మెదడు కణాలపై, జీర్ణ క్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పొట్ట ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. జీర్ణవ్యవస్థలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే గ్యాస్ ఉత్పత్తి అయి కడుపు ఉబ్బరంగా మారుతుంది.
అలా జరగలేదంటే జీర్ణ క్రియలో ఎటువంటి సమస్య లేదని అర్థం. అందువల్ల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలను తినకపోవటమే మంచిది. శరీరం ఆరోగ్యం ను జీర్ణ క్రియ నిర్ణయిస్తుంది. ఆరోగ్యంగా ఉంటేనే మంచి నిద్రను పొందుతారు. శరీరానికి మంచి నిద్ర లభిస్తే, అది శారీరక, మానసిక ఆరోగ్యానికి సంకేతంగా పరిగణించబడుతుంది. మలం, మూత్రంలో వచ్చే మార్పులు కూడా శరీర ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. రోజుల్లో ఒకటి లేదా రెండు సార్లు పేగు కదలికలను కలిగి ఉంటే, జీర్ణ క్రియపై ఎటువంటి ప్రతికూల ప్రభావం లేదని అర్థం. గ్యాస్ ఉంటే కడుపునొప్పి సమస్యలు వస్తాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే, కడుపు క్యాన్సర్ కు కారణం అవుతుంది. భోజనం తిన్న తరువాత కడుపు ఉబ్బరంగా ఉండటం, నొప్పి వంటి సమస్యలు క్యాన్సర్ కు సంకేతాలు.