చర్మం యవ్వనంగా కనిపించాలంటే పోషకాలు ఉన్న ఆహారాన్ని తినాలి. మనం తినే ఆహారం బట్టి మన చర్మం అందంగా మారుతుంది. ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి యంగ్ గా కనిపించాలని కోరిక ఉంటుంది. కానీ, ప్రస్తుత జీవన విధానంలోని మార్పులు, వాతావరణ కాలుష్యం, మేకప్ వంటి వాటి వల్ల కొందరు తమ వయసు కంటే పెద్దగా కనిపిస్తారు. అంతేకాకుండా ఏది పడితే అది తింటూ... శరీరంపై శ్రద్ధ చూపరు. మరికొందరు కేవలం వర్కౌట్లు మాత్రమే చేస్తుంటారు. వాటితో పాటుగా సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే ఫ్రీ రాడికల్స్ తో పోరాడటంతో పాటుగా కోల్లాజైన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది.

ఫలితంగా చర్మం కాంతివంతంగా మారుతుంది. కొన్ని ఆహార నియమాలను పాటించటం వల్ల వృద్ధాప్య ఛాయాలను తగ్గించుకునే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు కోల్లాజెన్ నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోజు వారి ఆహారంలో భాగంగా తినటం వల్ల చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. అంతేకాకుండా స్కిన్ యవ్వనంగా, హైడ్రేట్ గా కనిపిస్తుంది. తాజాగా ఉన్న ఆకు కూరలు చర్మం మెరుపును పెంచడంలో సహాయపడతాయి. పాలకూర, బచ్చలి కూర వండి గ్రీన్ ఆకుకూరలలో విటమిన్ ఎ, విటమిన్ సి, జింక్, ఐరన్, కాల్షియం, విటమిన్ కే, మెగ్నీషియం వంటి అవసరమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

వీటిని రోజువారి ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల రక్తం ఉత్పత్తి మెరుగుపడి, ఎముకలు దృఢంగా మారుతాయి. అంతేకాకుండా చర్మాన్ని మరింత అందంగా మార్చడానికి ఇవి సహాయపడతాయి. బాదం, జీడిపప్పు, పిస్తా, బ్రెజిల్ నట్స్ వంటి గింజలను రోజువారి ఆహారంలో చేర్చడం వల్ల ప్రయోజం ఉంటుంది. ప్రతీ రోజు కనీసం ఒకటి నుండి రెండు సార్లు వీటన్నింటిని కలిపి కొంత మోతాదులో తీసుకోవడం వల్ల స్కిన్ గ్లో అవుతుంది. పెరుగులో పుష్కలంగా ప్రోటీన్లు ఉంటాయి. ఇది తక్కువ కేలరీలు కలిగి ఉంది, జీవ క్రియకు సహాయపడే బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. పెరుగులోని ఫాస్పరస్, రైబోఫ్లావిన్ , కాల్షియం, విటమిన్ బి 12 పుష్కలంగా ఉంటాయి. దీనిని రోజు తివడం వల్ల ముఖం పై ఉన్న ముడతలు, గితలను తగ్గించి, చర్మాన్ని సున్నితంగా మారుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: