దీంతో ఆ ప్లేస్ లో మచ్చ ఏర్పడుతుంది. అది తగ్గడానికి నెలల సమయం పడుతుంది. అంతేకాకుండా గుంటలు కూడా పడతాయి. పైగా మొటిమ గిల్లటం ద్వారా బ్యాక్టీరియా స్కిన్ లోపలికి వెళ్లే ఛాన్స్ ఉంది. అలాగే బాడీలో ఇన్ఫ్లమేషన్ కు కారణంఅవుతుంది. కణాల మరమ్మతుకు అంతరాయం కలుగుతుంది. తద్వారా పింపుల్ గిల్లిన ఫేస్ లో మచ్చలు, దురద, ఎరుపు, గుంతలు పడి మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. కాగా పింపుల్స్ ను గిల్లడం వెంటనే మానేయండి. వాటి అంతట అవే మానేవరకు వెయిట్ చేయాలి. కాగా పింపుల్స్ వస్తే మేకప్ కు దూరంగా ఉండటం మేలు.
మేకప్ వేసినట్లయితే పింపుల్ మరింత ముదిరిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే మొటిమ పై దుమ్మ పడకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ దుమ్ము, ధూళి పడితే... దీనిపై బ్యాక్టీరియా చేరి... పుండుల తయారవుతుంది. పింపుల్ పాప్ అయ్యాక క్లెన్సర్ తో ఆ ప్లేస్ లో వెల్లిగా క్లీన్ చేయండి. బ్లడ్ , చీము లాంటివి ఉంటే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి... యాంటీసెప్టిక్ క్యాన్సర్ ను ఉపయోగించటం బెటర్ అంటున్నారు నిపుణులు. అలాంటి సమయంలో సిరం వాడడం ఆపేయండి. సువాసన లేని తేలకపాటి మాయిశ్చరైజర్ ను పింపుల్స్ పై అప్లై చేయండి. దురద, మంట రాకుండా మాయిశ్చరైజర్ కాపాడుతుంది. అబ్బాయిలు అంతగా పట్టించుకోకపోయినా.