కొంతమంది వీటిని వాడిన తరువాత తడి వాతావరణం లోనే పెడుతుంటారు. అయితే, ఈ లూఫా విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పలు చర్మా సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. లూఫాను వాడిన తరువాత దానిని పైపైన శుభ్రం చేసి, అలాగే బాత్ రూమ్ లో వదిలేస్తుంటారు. తడిగా ఉన్న లూఫాను అలా తేమ ప్రదేశంలో ఉంచటం వల్ల దీనిపై బ్యాక్టీరియా మరింత వృద్ధి చెందుతుంది. ఈ క్రమంలోనే ముఖంపై మొటిమలు, చర్మ సమస్యలకు కారణం అవుతుంది. అందుకే లూఫా ను వాడిన తరువాత దీనిని వెంటనే శుభ్రం చేసి, ఎండలో ఉంచడం మంచిది.
ఒకవేళ ఇది దుర్వాసన రావడం, రంగు మారటం వంటివి జరిగితే వెంటనే దీనిని మార్చేయడం మంచిది. సాధారణంగా ఈ లూపాలను నెలల తరబడి వాడితే చర్మ సమస్యలకు కారణం అవుతుంది. సింథటిక్ లూఫా అయితే రెండు నెలల వరకు వాడుకోవచ్చు. వారానికి ఒకసారి అయినా పెనిగర్ లేదా బ్లీచ్ కలిపినా నీటితో వేసి పది నిమిషాల పాటు లూఫాను అందులో ఉంచాలి. ఆ తరువాత దీనిని ఎండలో ఆరబెట్టాలి. ముఖ్యంగా సిల్క్ వంటి లూఫాను వాడటం బదులుగా ... సిలికాన్ బాత్ స్క్రబ్బర్లు లేదా వాష్ క్లాత్ వంటి ఉత్పత్తులను ఉపయోగించడం ఉత్తమం. వీటిని వాడిన తరువాత కూడా పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా శరీరాన్ని లూఫా తో ఎక్కువ సమయం స్క్రబ్ చేయకూడదు.