కానీ, నీళ్లు ఎక్కువగా తాగటం మంచిదే అయినా... అతిగా నీళ్లు తాగటం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరానికి కావాల్సినంత నీరు కంటే ఎక్కువగా ఇస్తే, మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుంది. వైద్య పరిభాషలో దీనిని వాటర్ ఇన్ టాక్సికేషన్ అంటారు. ఎండలో తిరిగినప్పుడు, ఆటలు ఆడే సమయంలో చెమట ఎక్కువగా పడుతుంది. దీనివల్ల శరీరంలో నీటి స్థాయిలు తగ్గకుండా ఎక్కువగా నీరు తాగుతుంటారు. ఇలా ఎక్కువగా నీరు తాగటం వల్ల వాటర్ ఇన్ టాక్సికేషన్ కు కారణం అవుతుంది. అయితే, శరీరంలో ఏర్పడే కొన్ని లక్షణాలు బాడీలోని నీటి స్థాయి పెరుగుతుందని సూచిస్తుంది. మితిమీరి నీళ్లు తాగటం వల్ల శరీరంలో మినరల్స్ ఎక్కువై, సోడియం స్థాయిలు పండిపోతాయి.
సోడియం స్థాయిలు పండిపోతే శరీరంలోని కణాల పనితీరు నెమ్మదిస్తుంది. దీనివల్ల తలనొప్పి, వాంతులు, చికాకు వంటి సమస్యలు వస్తాయి. ప్రతిరోజు అతిగా నీరు తాగితే, అది మెదడుపై ప్రభావం చూపుతుంది. దీంతోపాటు బీపీ పెరగడం, కండరాలు నిరసించిపోవటం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అందువల్ల శరీరానికి అవసరమైన నీటిని తాగటమే ఉత్తమం. కొంతమంది రోజుకు రెండు లీటర్లు తాగాలంటే... ఒకేసారి రెండు లీటర్ల నీటిని తాగేస్తారు. ఇలా చేయటం వల్ల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ఒకేసారి కాకుండా శరీరానికి తగినట్లుగా అప్పుడప్పుడు నీటిని తీసుకోవాలి.