దీనివల్ల అజీర్తి సమస్యలతో పాటుగా పేగు సమస్యలు, మానసిక సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. కొందరు ప్రతిరోజు స్పెసి ఫుడ్ ను ఎక్కువగా తింటుంటారు. దీనివల్ల బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. అధిక బీపీ ఉన్నవారు కాలం, మసాలాలను తగ్గించి, ఆహారం తినటం మంచిది. కారం ఎక్కువగా తినటం వల్ల జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది. సాధారణంగా వైద్యులు కారాన్ని తక్కువగా తినమని చెబుతుంటారు. కారం ఎక్కువగా తింటే అల్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. దీంతోపాటు గ్యాస్, కడుపులో మంట, పుండ్లు కూడా ఏర్పడతాయి. కారంతో పాటుగా మసాలాలు కూడా ఎక్కువగా తినటం మంచిది కాదు. దీనివల్ల జీర్ణకోశ సమస్యలు వస్తాయి.
ఎర్ర మిరపకాయలను ఎక్కువగా తినటం వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల కొడుకు దెబ్బతింటుంది. ఇది పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవటం మంచిది. ప్రతిరోజు తినే ఆహారంలో ఎక్కువగా కారం తీసుకోవటం వల్ల చర్మం లోని తేమ తగ్గి, పొడిబారటం తో పాటు చర్మ సమస్యలు వస్తాయి. మరి ముఖ్యంగా మసాలాలు ఎక్కువగా వేసిన ఆహారాన్ని ఎక్కువ పరిమాణంలో తినటం వల్ల బరువు పెరుగుతారు. ఎందుకంటే ఇందులో ఎక్కువ క్యాలరీలో ఉంటాయి. కారంతో పాటుగా మసాలాలను ప్రతిరోజు ఎక్కువగా తీసుకోవడం వల్ల పైల్స్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల రోజువారి ఆహారంలో మసాలాలు, కారం తగినంతగా వేసుకోవడం మంచిది.