చలికాలం వచ్చిందంటే చాలు రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. చలికాలంలో కళ్ళు ఎర్రగా అయిపోతాయి. బయట ఎక్కువగా తిరగటం వల్ల కూడా కళ్ళు ఎర్రగా అయ్యే అవకాశం ఉంటుంది. మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో వాతావరణ కాలుష్యం, వాయు కాలుష్యం అధికంగా ఉంటాయి. దీంతో కళ్ళు ఎర్రబడడం, పొడిబారతం, దురద, మంట, శ్వాస కోస సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కళ్ళ సంరక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.

ముఖ్యంగా బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం, యూవీ కిరణాల నుంచి రక్షణ కోసం కళ్ళజోడు ఉపయోగించటం వంటివి చెయ్యాలి. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. శరీరంలో ఎంతో ముఖ్యమైన కళ్ళు చాలా సునితమైన అవయవాలు కూడా. కాబట్టి ప్రత్యేక శ్రద్ధ అవసరం అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా గాలిలోని దుమ్ము, ధూళి, పలు రకాల విషయపదార్థాలు కళ్ళలోకి చేరితే హాని కలిగిస్తాయి. ఇన్ఫెక్షన్లు సోకి దురద, మంట వంటివి సంభవిస్తాయి. కాబట్టి బయటి వాతావరణ పరిస్థితుల్లో కళ్ళజోడు ధరించడం బెటర్. అలాగే అలసిపోయినట్లు అనిపించినా , కళ్లు నొప్పి పుట్టిన కోల్డ్ కంప్రెన్స్ తక్షణ ఉపశ్రమనాన్ని ఇస్తుంది.

నిద్రకు ఉపక్రమించే ముందు ధరించగలిగే కోల్డ్ కంప్రెస్ ప్యాడ్ లు కూడా ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నాయి. అలాంటి అవకాశం లేకపోతే శుభ్రమైన కాటన్ గుడ్డను నీటిలో తడిపి కళ్ళపై ఉంచడం వల్ల ఉపశమనం కలుగుతుంది. బయట తిరిగి వచ్చిన తరువాత మొహం, కళ్ళను నీటితో శుభ్రంగా కడుక్కోవటం, సరైన పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోవటం, ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ ఎ, ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవటం, శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవటం వంటివి చేయడం వల్ల కళ్లకు మేలు జరుగుతుంది. ఇక కాలుష్యం వల్ల గాలి, ఇంకేదైనా ప్రాబ్లం వల్ల గాని కళ్ళలో దురద, మంట, ఎర్రబడడం వంటివి సంభవిస్తే వెంటనే కంటి వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: