ప్రస్తుత రోజుల్లో చాలామంది ఈ వ్యాధి బారిన పడుతున్నాను. జీవన శైలిలో మార్పులా కారణంగా, చెడు ఆహారపు అలవాట్లు వల్ల డయాబెటిస్ లక్షణాలు తీవ్రంగా మారుతున్నాయి. అయితే డయాబెటిస్ వచ్చాక కూడా జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. కానీ చిన్న చిన్న పొరపాట్లు వల్ల షుగర్ లెవెల్స్ వేగంగా పెంచడానికి పనిచేస్తుంది. కాగా షుగర్ లెవెల్స్ అదుపులో ఉండాలంటే ఈ రాత్రిపూట ఈ తప్పులు చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. డయాబెటిస్ పేషెంట్లు రాత్రి త్వరగా నిద్రపోకపోతే షుగర్ లెవెల్స్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
తప్పకుండా 8 గంటల నిద్ర అవసరం. బాడీకి విశ్రాంతి ఇవ్వకపోతే డయాబెటిస్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. తక్కువ నిద్ర కారణం చిరాకు, ఒత్తిడి, కార్టిసాల్ హార్మోన్ పెరగడం స్టార్ట్ అవుతుంది. దీంతో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. షుగర్ పేషెంట్లు రాత్రి భోజనం తర్వాత వెంటనే దుప్పటి కప్పుకుని పడుకోకూడదు. చల్లటి వాతావరణం లో బాడీ చాలా బద్దకంగా మారుతుంది. తిన్న తర్వాత తప్పకుండా 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. అలాగే భోజనం అనంతరం షుగర్ పేషెంట్లు కాఫీ, టి తాగడం, స్వీట్స్ తినటం మానేయాలి. ముఖ్యంగా ఇవి చక్కెర స్థాయిలు పెంచడానికి దారితీస్తుంది.