ప్రతిరోజు యోగా చేయటం ఆరోగ్యానికి చాలా మంచిది. యోగాతో పాటు నవ్వడం కూడా ఆరోగ్యం నీకి మంచిది. ఈ బిజీ కాలంలో చాలామంది ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కొంటున్నారు. దీనివల్ల శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రశాంతంగా కూర్చుని మనస్ఫూర్తిగా నవ్వడమే మానేశారు. నవరసాల్లో మనకు ఆరోగ్యానికి ఇచ్చేది హస్వరసమే. అలాంటి హాస్యం ప్రతి ఒక్కరి జీవితంలో కీలకపాత్ర పోషిస్తుంది. నవ్వించడం ఒక యోగము, నవటం భోగము, నవ్వకపోవటం రోగం అనే మాటను పెద్దలు చెబుతుంటారు. ప్రతి ఒక్కరూ నిత్యం ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించే మంచి మెడిసిన్ నవ్వు మాత్రమే.

ఈరోజుల్లో చాలామంది ఏదైనా కామెడీ షో, సినిమా చూస్తూ, ఫన్నీ సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే నవ్వుతుంటారు. నవ్వు మంచి వ్యాయామం లాంటిది. దీనివల్ల జ్ఞాపకశక్తి పెరగటంతో పాటుగా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు నవ్వడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇక్కడ చూద్దాం. ప్రతిరోజు నవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మనస్ఫూర్తిగా నవ్వటం వల్ల రక్తనాళాలకు విశ్రాంతి లభిస్తుంది. గట్టిగా నవటం వల్ల శరీరంలో యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు. శరీరంలోని కేలరీలు బర్న్ అవుతాయి. ప్రతిరోజు గట్టిగా నవ్వటం వల్ల ఎండార్ఫిన్లు రిలీజ్ అవుతాయి. దీనివల్ల శరీరంలోని నొప్పులు తగ్గుతాయి.

 స్నేహితులు లేదా బంధువులతో కలిసి కూర్చుని నవ్వడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల ఇతరుల పట్ల ప్రేమ, కుటుంబ బంధాలు బలపడతాయి. ఇది శరీరానికి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్ లా పని చేస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచి, శరీరాన్ని తేలికగా ఉంచుతుంది. రోజుకు 10 లేదా 15 నిమిషాల పాటు నవ్వటం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సహజసిద్ధమైన నవ్వు స్ట్రెస్ ను తగ్గించి మైండ్ ను రిలాక్స్ చేస్తుంది. గట్టిగా నవ్వినప్పుడు శరీరంలో ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇవి ముత్తిడికి కారణమైన కార్డిసాల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీని కారణంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: