మీ బ్రెయిన్ షార్ప్ గా ఉండాలంటే ఈ ఆహారాన్ని తప్పకుండా తినాల్సిందే. ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని తినటం బ్రెయిన్ కి చాలా అవసరం. ధ్యానం కూడా బ్రెయిన్ కి చాలా మంచిది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఎన్నో ఒత్తిళ్ళను మెదడు ఎదుర్కొంటుంది. దీనివల్ల మెదడు పనితీరుపై ప్రభావం పడి, చేసే పని పై ఏకాగ్రత ఉండదు. ఏదైనా విషయం గురించి ఆలోచించాలన్నా లేదా సరైన నిర్ణయం తీసుకోవాలనుకున్న మెదడు పాత్ర కీలకంగా ఉంటుంది. ఇది అనేక నాడుల సమూహం. అటువంటి మెదడు చురుగ్గా, పవర్ ఫుల్ గా పనిచేయాలంటే కొన్నిటిని అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటు కారణంగా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది.

మరి మెదడుకు పదును పెట్టే ఆ అలవాటు ఏంటో ఇక్కడ చూద్దాం. శరీరంలో రక్తం సరఫర సరిగ్గా జరగాలంటే వ్యాయామం తప్పనిసరిగా చేయాలని నిపుణులు చెబుతున్నారు. ధ్యానం, జాగింగ్, నడక, తేలికపాటి వ్యాయామాలు చేయటం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శారీరక వ్యాయామం శరీరాన్ని దృఢంగా మార్చుతుంది. ప్రతిరోజు ఉదయం వ్యాయామం చేయటం వల్ల కొత్త న్యూరాన్ల పెరుగుదలను ఇది ప్రోత్సాహిస్తుంది. ప్రతిరోజు ధ్యానం చేయటం వల్ల ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని 10 నుండి 20 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

జర్నలింగ్ చేయటం వల్ల క్రియేటివిటీ పెరుగుతుంది. బాబు వేగాలను నియంతరించడంలో ఇది సహాయపడుతుంది. మీ లక్ష్యాలను, ప్రణాళికలు, ఆలోచనలకు 10 నిమిషాలు కేటాయించి రాయటం వల్ల ఆలోచన శక్తి మెరుగుపడుతుంది. ఇది సమస్య పరిష్కార నైపుణ్యంను మెరుగుపరుస్తుంది. మెదడును పదను పెట్టేందుకు ఇది సహాయపడుతుంది. క్రాస్ వర్డ్ పజిల్ లేదా సుడోకు పరిష్కరించడానికి 10 లేదా 15 నిమిషాలు కేటాయించండి. సాధారణంగా వేటిని ఎక్కువగా చిన్నపిల్లలు ఆడుతుంటారు. కొన్ని ముక్కలన్నిటిని సరైన పద్ధతిలో కలిపితే ఒక ఆకారం వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: