చాలామంది వీటిని తొలగించడం కష్టమని భావిస్తారు. దీనికి రకరకాల కిచెన్ టిప్స్ ని ఫాలో అవుతుంటారు. అయినా సరే కొన్నిసార్లు ఈ మరకలు అలాగే ఉండిపోతాయి. ఆ మొండి మరకలను ఈజీగా తొలగించడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. కిచెన్లో పొరపాటున నూనె ఒలికి పోతే వెంటనే దానిపై గోధుమపిండి చల్లాలి. కొంతసేపటి తరువాత పేపర్ తో తుడిస్తే నూనె పడిన ప్రాంతం జిడ్డుగా లేకుండా ఉంటుంది. అలాగే కిచెన్ వాల్ మరకలను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది.
ఒక గిన్నెలో కొద్దిగా గోరు వెచ్చని నీళ్లు తీసుకుని అందులో టీ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం నిమ్మరసం కలపాలి. ఇప్పుడు స్పే బాటిలో ఈ వాటర్ ని పోసి, కిచెన్ వాల్ పై స్ర్పే చేసి, శుభ్రంగా రుద్దాలి. ఇలా చేయటం వల్ల మొండి మరకలు తొలగిపోతాయి. వంట గదిలోని మరకలను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా, వెనిగర్ రెండు బాగా ఉపయోగపడతాయి. నూనె మరకలు పడిన వెంటనే గోరువెచ్చని నీటిలో ఈ రెండిటిని కలిపి తుడిస్తే అవి జిడ్డుగా మారవు. అలాగే టూత్ పేస్ట్ కూడా ఈ మరకలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. టూత్ పేస్ట్ ని ఆయిల్ స్టెయిన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి, కొంత సమయం తరువాత కడిగేస్తే ఈ మరకలు ఈజీగా పోతాయి.