డైలీ డ్రై ఫ్రూట్స్ ని తినటం చాలా మంచిది. ఏ సమస్య ఉన్నవారైనా కానీ డ్రై ఫ్రూట్స్ని తినవచ్చు. డ్రై ఫ్రూట్స్ లో ఎన్నో పోషకాలు ఉంటాయి. కాబట్టి డ్రై ఫ్రూట్స్ ని రోజు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పలు రకాల డ్రై ఫ్రూట్స్ తినటం వల్ల మీ శరీరానికి కావాల్సిన విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ మొదలైన వివిధ పోషకాలు అందుతాయి. అంతేకాకుండా డ్రై ఫ్రూట్ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. క్యాన్సర్ నివారణ, టైప్ 2 డయాబెటిస్ నియంత్రణ, వెయిట్ లాస్, బరువు పెరగటం, బోన్స్ నో స్ట్రాంగ్ గా ఉంచడంలో మేలు చేస్తాయి. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి.

బాదంపప్పు, వాల్నట్స్, పల్లీలు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వంటి డ్రైఫ్రూట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి తోడ్పడుతాయి. అయితే షాప్స్ లో కెళ్లినప్పుడు ధర తక్కువ ఉన్నట్లైతే... చాలామంది ఒకేసారి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కొనుగోలు చేస్తుంటారు. దీంతో అప్పుడప్పుడు పడయ్యే అవకాశాలు ఉంటాయి. రంధ్రాలు ఏర్పడడం, పురుగులు పడటం లాంటివి జరుగుతాయి. డ్రై ఫ్రూట్స్ పాడవ్వడానికి కారణాలు... ఎక్కువ కాలం నిలవ ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. డ్రై ఫ్రూట్స్ పాడవ్వడానికి మెయిన్ రీజన్ సరిగ్గా స్టోర్ చెయ్యకపోవటం. గాలి, వెలుతురు చేరి తొందరగా పాడైపోతాయి.

వెలుతురు, గాలి తగలటం కారణంగా అవి ఆక్సీకరణ చెందుతాయి. బొక్కలు పడుతాయి. టేస్ట్ పోతుంది. పిండి పిండిగా మారుతాయి. కాకా గాలి చొరబడని కంటైనర్లు, డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టాలి. ఒకవేళ ఫ్రిడ్జ్ లో పెట్టాలనుకుంటే ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టి మూత సరిగ్గా పెట్టి స్టోర్ చేయవచ్చు. సరిగ్గా నిలువ చేస్తే మాత్రం ఏడాది పాటు నిల్వ ఉంటాయి. అలాగే డ్రై ఫ్రూట్స్ కు మసాలా, తేమ, షూటైన స్మెల్ వచ్చేవి దూరంగా ఉంచాలి. అలాగే వీటిని చాలామంది ప్యాకెట్లలో ఉంచుతారు. కానీ తిన్నాక వాటికి క్లిప్స్ పెట్టాలి. దీంతో పాడవకుండా ఉంటాయి. డైరెక్ట్ ఎండ తగ్గిలే ప్లేస్ లల్లో మాత్రం అస్సలు ఉంచకూడదు. సూర్య రశ్శి తక్కువగా ఉన్న కాస్త చీకటిగా ఉన్న దగ్గర పెడితే బెటర్.

మరింత సమాచారం తెలుసుకోండి: