వింటర్ వచ్చిందంటే చాలు వేడివేడిగా ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది. శీతాకాలంలో చలి ఎక్కువగా ఉండటం వల్ల వేడిగా తినాలని అనిపిస్తుంది. ఏదైనా కానీ వేడివేడిగా ఉంటే బాగా ఇష్టపడతాము. శీతాకాలంలో వేడివేడిగా సూప్ తాగుతుంటే చాలా బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. చలికాలంలో సూపు తాగితే శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలను ఇది నియంతరిస్తుంది. అయితే, ఈ సూప్ లలో చాలా రకాలు ఉంటాయి. వీటిని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. వాటిల్లో టమాటా సూప్ ఒకటి.

దీనిని తయారు చేసేందుకు ఎక్కువ సమయం కూడా పట్టదు. రెస్టారెంట్ స్టైల్లో టమాటా సూప్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. టమాటాలు, ఆనియన్, వెల్లుల్లి , ఉప్పు, నూనె, జీలకర్ర, దాల్చిన చెక్క పొడి, కొత్తిమీర,కారం, బ్రెడ్, బటర్ పదార్థాలని తీసుకోవాలి. ఆ తరువాత వెల్లుల్లి, ఆనియన్, కొత్తిమీరను సన్నగా తరగాలి. టమాటా ముక్కలను కచ్చాపచ్చాగా మిక్సీలో పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, దాల్చిన చెక్క పొడి వేసి లైట్ గా వేయించుకోవాలి. ఆ తరువాత అందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి వేయించుకోవాలి.

 ఈ విష్టమం వేగిన తరువాత అందులో టమాటా పేస్ట్ వేసి, 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అందులో కొంచెం కారం, నీరు పోసి 10 నిమిషాల పాటు సన్నని మంట మీద వాటిని ఉడికించుకోవాలి. సూప్ కాస్త చిక్కగా ఉన్నప్పుడు అందులో కొత్తిమీరను చల్లండి. తరువాత బటర్ లో బ్రెడ్ ముక్కలను వేయించి, వాటిని చిక్కటి సూప్ పైన వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే వేడివేడిగా టమాటా సూప్ రెడీ. ఈ టేస్టీ టేస్టీ సూప్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: