కొంతమందికి ఇల్లు శుభ్రం చేస్తే చాలు డస్ట్ ఎలర్జీ వచ్చేస్తుంది. సాధారణంగా చాలామందికి డస్ట్ ఎలర్జీ ఉంటుంది. డస్ట్ ఎలర్జీ ఉన్నవారు దుమ్ము ఉన్న ప్రాంతాలకి వెళ్లకపోవటం మంచిది. ఎందుకంటే డస్ట్ ఉన్న ప్రాంతాలకి వెళ్ళినప్పుడు ఆ డస్ట్ ముక్కకి పట్టటం వల్ల దుమ్ములు అతిగా వచ్చేస్తూ ఉంటాయి. తద్వారా ఆరోగ్య సమస్యలు ప్రారంభిస్తాయి. కాబట్టి డస్ట్ ఎలర్జీ ఉన్నవారు దుమ్ములోకి వెళ్లకపోవటమే మంచిది. సాధారణంగా డస్ట్ ఎలర్జీ అనేది ఎక్కువగా శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారికి వస్తుంది.

తుమ్ములు, దగ్గు, ముక్కు కారటం వంటివి డస్ట్ ఎలర్జీ లక్షణాలు. కొంతమంది వీటికి మందులు వాడుతుంటారు. ఇలాంటి సమస్య ఉన్నవారు ఈ చిట్కాలను పాటిస్తే ఉపశమనం లభిస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు గోరు వెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనె కలుపుకుని తాగితే ఫలితం ఉంటుంది. నీటిలో తులసి ఆకులను వేసుకుని వాటిని బాగా మరిగించుకోవాలి. తరువాత అందులో చిటికెడు పసుపు వేసి తాగాలి. ఇలా చేయటం వల్ల అలర్జీ సమస్యలను తగ్గించవచ్చు. ఒక స్పూన్ తేనెలో కొంచెం అల్లం రసం కలిపి, ప్రతిరోజు ఉదయమునే పరగడుపున తీసుకోవటం వల్ల ఉపశమనం లభిస్తుంది.

ముక్కు దిబ్బడ సమస్యలను తగ్గించుకోవాలంటే గోరువెచ్చని నీటిలో కాస్త రాళ్ల ఉప్పును కరిగించుకోవాలి. ఈ నీటితో ఆవిరి పట్టడం వల్ల ముక్కు దిబ్బడ సమస్యలను తగ్గించి, శ్వాస ఆడేలా చేస్తుంది. కాబట్టి ఈ చిట్కాను తప్పకుండా పాటించండి. అల్లం టీ ని రోజు తాగటం అలవాటు చేసుకోండి. అల్లం లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అవి శరీరంలోని హానికరమైన ప్రీ రాడికల్స్ తో పోరాడతాయి. డస్ట్ ఎలర్జీ ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ చిట్కాలని తప్పకుండా ఫాలో అవ్వండి. మీకున్న డస్ట్ ఎలర్జీని వెంటనే తగ్గించుకోవాలి అనుకుంటే ఈ చిట్కాలను పాటించటం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: