శీతాకాలంలో గది వేడిగా ఉండటానికి మనం హీటర్ని వాడుతుంటాము. ఎక్కువగా హీటర్ని వాడటం కూడా మంచిది కాదు. రూమ్ టెంపరేచర్ కోసం హీటర్ని మరీ ఎక్కువగా వాడకూడదు. చూస్తుండగానే చలికాలం రానే వచ్చేసింది. జనాలు బయటకి వెళ్ళమంటే చలికి వనికి పోతున్నారు. పట్టణ ప్రజలు ఉదయం పూట స్వెటర్లు లేనిదే బయటకి రావటం లేదు. పల్లెల్లో నివసించేవారు తెల్లవారితే చాలు మంట వేసుకుంటున్నారు. మునప్పటి కన్నా చలి తీవ్రత బాగా ఉండటంతో ప్రజలు అమ్మో చలి అంటూ భయపడిపోతున్నారు. అయితే కొంతమంది చలికి తట్టుకోలేక శీతాకాలంలో రూమ్ హీటర్ వాడుతున్నారు.

 ఈ హీటర్ వల్ల గది వెచ్చగా ఉంటుంది. కానీ హీటర్ నుంచి వచ్చే వేడి గాలి స్కిన్ కు హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కాదా హీటర్ లేకుండా మీ బెడ్ రూమ్ ను సహజంగా వెచ్చగా ఉంచుకోవడమెలాగో ఇప్పుడు చూద్దాం. చలికాలం ఇల్లంతా వెచ్చగా ఉండాలంటే విండోస్, డోర్స్ క్లోజ్ చేసి ఉంచాలి. ఒకవేళ ఏ మూల నుంచైనా గ్యాప్ ఉన్నట్లైతే... ఆ ప్లేస్ లో టేప్ లేదా ఏదైనా క్లాత్ తో మూసి వేస్తే సరిపోతుంది. అలాగే పగలు ఎండ కాస్త ఎక్కువగా ఉన్నప్పుడు కిటికీలు తెరిచి ఉంచండి. సూర్య రశ్మి ఇంట్లోకి రావడం వల్ల గది ఉష్ణోగ్రత పెరుగుతుంది.

 నేల మీద మందంగా ఉండే ప్యాడెడ్ కార్పెట్ వెయ్యండి. లేకపోతే రగ్గు వెయ్యండి. అలాగే మంచం పై షిట్ వెయ్యడానికి ముందు మందమైనా దుప్పటిని వేస్తే కాస్త వేడిగా ఉంటుంది. డోర్స్, విండోస్ కు ముదురు కలర్ ఉన్న కర్టెన్లు వెయ్యండి. ఇది వేడి గాలిని బయటకి వెళ్లకుండా ఆపుతాయి. చలికాలం టెంపరేచర్ తగ్గుతుంటే వెంటనే కోవ్వోత్తులు వెలిగించండి. లేదా దీపాలు అయినా వెలిగించవచ్చు. కానీ పడుకునే ముందు వాటిని ఆర్పేయాలి. అలాగే నిద్రించేటప్పుడు మీ పక్కన బాటిల్లో హాట్ వాటర్ పోసి పక్కన పెట్టుకోండి. దీంతో గది వేడిగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: