డ్రాగన్ ఫ్రూట్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. బ్లడ్ లేనివారు డ్రాగన్ ఫ్రూట్ ని ఎక్కువగా తినటం మంచిది. డ్రాగన్ పండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిని డైలీ తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. వివిధ ఆహారాలు, పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా... షుగర్ పేషంట్స్ ఏవి తినాలి? , ఏవి తినకూడదు? అనే సందేహాలు పలువురిని వెంటాడుతుంటాయి. అలాంటి వారిలో డ్రాగన్ ఫ్రూట్ కూడా ఒకటి. తియ్యగా ఉండే ఈ పండును తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయేమోనని కొందరు భావిస్తుంటారు. కానీ అలాంటి అపోహ అవసరం లేదని, రోజుకు వంద గ్రాముల వరకు తినవచ్చని పోషకాహార నిపుణులు అంటున్నారు.

 పైగా దీనివల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. డ్రాగన్ ఫ్రూట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీ న్యూట్రియంట్స్, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. పైగా ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువ. కాబట్టి తగిన మోతాదులో రెగ్యులర్గా తీసుకున్న డయాబెటిస్ ఉన్నవారికి ప్రాబ్లం ఉండదు. పైగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కాకపోతే రోజులో వంద గ్రాములకంటే ఎక్కువగా తినకపోవడం మంచిది. ఎందుకంటే వంద గ్రామంలో సుమారు 60 క్యాలరీలు ఉంటాయి.

 ఈ మోతాదు షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ఫైబర్ కంటెంట్ మూలంగా డ్రాగన్ ఫ్రూట్ ఇన్సులిన్ సెన్సిటివిటిని మెరుగు పరుస్తుంది. గ్లూకోజ్ శోషణను నియంతరించటం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం మెండుగా ఉండటం వల్ల బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ మధుమేహం ఉన్నవారికి గుండె జబ్బుల రిస్క్ ను తగ్గిస్తాయి. అధిక బరువు సమస్యను, జీర్ణక్రియ సమస్యలను నివారిస్తుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కూడా డైలీ 100 గ్రాముల వరకు డ్రాగన్ ఫ్రూట్ ను తినవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: