అయితే రోజుకు ఎంతసేపు వాకింగ్ చేయాలి? ఏ వయసు వారు ఎన్ని గంటలు నడిస్తే ఆరోగ్యానికి మంచిది? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. మీరు 18 నుంచి 30 ఏండ్ల మధ్య వయసు వారైతే రోజు కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయాలంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు. ఈ ఏజ్ లో ఎనర్జీ లెవెల్స్ కూడా బాగుంటాయి. కండరాలు అన్ని రకాలుగా సహకరిస్తాయి. కాబట్టి గంటకు తగ్గకుండా కూడా వాకింగ్ చేయవచ్చు. దీనివల్ల అధిక బరువు సమస్య రాకుండా ఉంటుంది. పైగా గుండె ఆరోగ్యానికి మంచిది. కొందరు వయస్సు పెరుగుతున్న కొద్ది ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిస్తుంటారు.
అలా చేయటం కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. ఇతర వ్యాయామాలు చేయకపోయినా... కనీసం వాకింగ్ మాత్రం కంటిన్యూ చేయాలంటున్నారు. అయితే 31 నుంచి 50 ఏండ్ల లోపు వయసు వారు రోజు కనీసం 30 నుంచి 45 నిమిషాలు నడి సైనే మంచిది. దీనివల్ల కండరాల బలహీనత రాకుండా ఉంటుంది. అధిక బరువు తగ్గుతారు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 51 నుండి 65 ఏండ్ల లోపు వారికి వయసు రీత్యా ఇతర వ్యాయామాలు కష్టం కావచ్చు. అయినా వాకింగ్ చేయటం మాత్రం తప్పనిసరి అంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు. రోజు కనీసం 30 నిమిషాల నడక ఈ ఏజ్ లో ఎంతో మేలు చేస్తుంది. బోన్స్ దృఢంగా, ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది.