మరికొంతమంది సరిగ్గా నూనె రాసుకోకపోవడం వల్ల కూడా ఎయిర్ లోన్స్ అవుతుంటుంది. పైగా చలికాలంలో కుదుళ్ళలోని స్కిన్ పొడిబారి పోవటం వల్ల చుండ్రు తయారవుతుంది. అంతేకాకుండా పేలు కూడా వస్తాయి. దీంతో తలలు దురద వస్తుంది. దీంతో హెయిర్ దృఢత్వాన్ని కోల్పోతుంది. కాగా ఈ సమస్యకు చెప్పు పెట్టాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు అంటున్నారు నిపుణులు. కొబ్బరి నూనె, బాదం, ఆలివ్ ఆయిల్ వంటి నూనెల్ని వీక్లీ ఒక్కసారైనా పెట్టాలి. దీంతో దురద రాకుండా ఉంటుంది. హెయిర్ కూడా పట్టులా మెరుస్తుంది. అలాగే తలస్నానం చేశాక హెయిర్ పూర్తిగా ఆరిన తరువాత జడ వేసుకోవాలి. లేకపోతే జుట్టు కుదుళ్లలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. దురద కూడా వస్తుంది.
దురద తగ్గడమే కాకుండా పూర్తి సంపూర్ణ ఆరోగ్యం కోసం రోజు తప్పకుండా తాజా పండ్లు తినాలి. అలాగే కూరగాయలు, నట్స్ వంటివి ఆహారంలో భాగంగా చేసుకోవాలి. మసాజ్ చేయాలి. మసాజ్ చేయటం వల్ల బ్లడ్ సర్కులేషన్ సాఫీగా జరుగుతుంది. హెయిర్ కు ఆయిల్ రాసుకునే ముందు కాస్త గోరువెచ్చగా వేడి చేయాలి. దీంతో దురద తగ్గుతుంది. కాబట్టి ఈ టిప్స్ ని తప్పకుండా పాటిస్తే నీ దురద వెంటనే తగ్గుతుంది. బ్లడ్ సర్కులేషన్ కూడా సాఫీగా జరుగుతుంది. కాబట్టి జుట్టుకి నూనె రాసేటప్పుడు మసాజ్ చేసుకోవడం మంచిది. చేయటం వల్ల జుట్టు మృదువుగా మారుతుంది.