నా ఆరోగ్యం, నా హక్కు, ప్రపంచవ్యాప్తంగా స్థానిక ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఈరోజున గురించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 2023 వ సంవత్సరంలో 13 లక్షల మందికి పైగా హెచ్ఐవి బారిన పడినట్లు ఆధ్యాయణాలు తెలిపాయి. అయితే, ఒకప్పుడు ఎయిడ్స్ ను నియంతరించే పరిస్థితి లేదు. దానికి సరైన చికిత్స కూడా లేదు. ఈ దీర్ఘకాలిక వ్యాధిని ఎలా గుర్తించాలి, రోగనిర్ధారణ, అంటూ యాది సంరక్షణ వంటి అంశాలపై అవగాహనను కల్పిస్తుంటారు. హెచ్ఐవి సోకిన వారు కొద్ది రోజుల్లోనే చనిపోతారనే అపోహ చాలామందిలో ఉంటుంది. కానీ, దీనికి సరైన చికిత్స తీసుకుంటూ.. తగిన జాగ్రత్తలు పాటించటం వల్ల హెచ్ఐవి ఉన్నవారు కొన్ని సంవత్సరాల పాటు జీవించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇవి సాధారణంగా దగ్గు, జలుబు, షేక్ హ్యాండ్స్ ద్వారా ఒకరి నుంచి ఒకరిని వ్యాపిస్తుందని చాలామంది అపోహ పడుతుంటారు. ఇది ఎంత మాత్రం నిజం కాదు. అసురక్షత లైంగిక సంభోగం చేస్తే, జననాంగాల స్రావాల కారణంగా ఒకరి నుండి మరొకరికి ఈ హెచ్ఐవి వ్యాపిస్తుంది. హెచ్ఐవి మందులు వాడటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చాలామంది అనుకుంటారు. ఇది ఏమాత్రం నిజం కాదు. దీనిది పూర్తిగా నివారించలేకపోయినప్పటికీ.. కొన్ని రకాల మందులు ప్రతిరోజు వాడుతూ, సరైన చికిత్స తీసుకోవటం వల్ల ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది.