ఈ నగరాన్ని ఎప్పుడైనా చూసారా ? ఈ నగరంలో చీకటయ్య తప్ప వెలుగు అనేదే ఉండదు. ఈ నగరం ఎక్కడ ఉంటుందో మీకు ఏమైనా తెలుసా? చలికాలంలో ఒక రోజు కూడా సూర్యుడు ఉదయించకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే రెండు నెలల పాటు సూర్యుడు నీ చుట్టూ ప్రకాశించకపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మనం రోజువారి పనులను ఎలా పూర్తి చేసుకోగలం. సూర్యకాంతి లేకుండా ఎలా జీవిస్తాం. అది కూడా ఎముకలు కొరికే శీతాకాలంలో.
ఆలోచిస్తేనే భయంకరంగా ఉంది కదా. కానీ ఓ దేశంలో మాత్రం శీతాకాలంలో రెండు నెలల పాటు సూర్యోదయమే అవ్వదంట. వామ్మో వింటుంటేనే బల్లు జలదరిస్తుంది. మరి అక్కడ ఉన్న వారి పరిస్థితి ఏంటో కదా. ఇంతకీ ఈ ప్రాంతం ఎక్కడ ఉంది, ఎందుకు రెండు నెలల పాటు సూర్యోదయం అవ్వదో ఇప్పుడు చూద్దాం. అమెరికాలోని ఆల్కస్కాలో ఒక చిన్న పట్నం ఉంది. దీని పేరు ఉత్కియాగ్విక్. దాదాపు 2 నెలల తరువాత ఈ నగరంలో సూర్యుడు ఉదయించనున్నాడు. ఉత్కయూనిక్ లో చివరిసారిగా నవంబర్ 18 న సూర్యోదయం జరిగింది.
ఇప్పుడు సరిగ్గా 64 రోజుల తరువాత అంటే జనవరి 22 న ఈ నగరంలో సూర్యోదయం అవుతుంది. ఈ నగరం 64 రోజులా పాటు అంధకారంలో ఉంటుంది. ఆర్కిటిక్ సముద్రానికి సమీపంలో అలస్కా ఉత్తర వాలులో ఉన్న బారో అని పిలవబడే ఉత్కియాగ్విక్ లో సుమారు 5 వేల మంది నిర్వహిస్తున్నారు. ఉత్తరాన ఉన్న ప్రదేశం కారణంగా నగరం ప్రతి సంవత్సరం సూర్యోదయం లేకుండా చాలా రోజులు గడుపుతుంటుంది. నవంబర్ 18 న, సూర్యుడు స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:27 కి అస్తమించాడు. ఇప్పుడు 64 రోజుల తరువాత, జనవరి 22 న దాదాపు 1:15 గంటలకు సూర్యుడు ఉదయిస్తాడు. అది కూడా 48 నిమిషాలు మాత్రమే. అంటున్నారు పరిశోధకులు.