ఈరోజుల్లో ప్రతి వారికి క్యూఆర్ స్కానర్ తప్పకుండా ఉంటుంది. ప్రతి షాప్ లో కూడా ఈ క్యూర్ స్కానర్ ని పెట్టుకుంటున్నారు. యువర్ స్కానర్ ఎలా పని చేస్తుందో అందరికీ తెలిసిందే. భారతదేశము డిజిటల్ యుగం వైపు దూసుకెళ్తుంది. ప్రపంచం మొత్తం మీద అత్యధిక సంఖ్యలో ప్రజలు ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. అయితే, ఈ చెల్లింపులు చేసే వారిలో ఎక్కువగా భారతదేశం వారే ఉన్నారు. డిజిటల్ చెల్లింపులో అత్యంత ముఖ్యమైనది క్యూఆర్ కోడ్. దీని సహాయంతో ఎవరికైనా ఈజీగా నగదును చెల్లించవచ్చు. ప్రతిరోజు కొన్ని కోట్ల మంది దీని ద్వారా నగదు చెల్లింపు చేస్తున్నారు.

ఈ క్యూఆర్ కోడ్ లోనే ఏముంటుంది? ఇది ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. క్యూఆర్ కోడ్ విధానాన్ని జపాన్ లో 1994 వ సంవత్సరములో మసాహీకో హారా అభివృద్ధి చేశారు. ఇందులో చిన్నచిన్న నల్లటి బ్యాంకులు ఉంటాయి. వాటిని మాడ్యుల్స్ అని అంటారు. అందులో డేటా అనేది స్టోర్ అవుతుంది. సాధారణంగా ఇది 2 డెమెన్షన్ లో ఉంటుంది. రెడబుల్ ఆప్టికల్ లేబుల్ లో యూఆర్ఎల్, కాంటాక్ట్ డిటెయిల్స్, ఇలా వివిధ రకాల సమాచారాన్ని పొందుపరచవచ్చు దానిని స్కాన్ చెయ్యటం ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు.

సాధారణంగా డబ్బు లావాదేవిల చెయ్యడానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ, ప్రపంచ దేశాల్లో ఎక్కువగా డేటాను స్టోర్ చేయడానికి వీటిని ఉపయోగిస్తుంటారు. ఈ క్యూఆర్ కోడ్ లో మూడు పెద్ద బ్యాక్సులు ఉంటాయి. ఇది క్యూఆర్ కోడ్ ను పోజిషన్ లో ఉంచడానికి సహాయపడతాయి. క్యూఆర్ కోడ్ లోని ఆలైన్ మెంట్ ఫ్యాటర్న్,టైమింగ్ పాటర్న్ అందులోని డేటా ఏంటి, దానిని ఎవరు తెలుసుకుంటున్నారో చెక్ చేస్తుంటుంది. అయితే, ఈ కోడ్ లోని 30 శాతం భాగం కనిపించకపోయినా, చెరిగిపోయిన అందులోని డేటాను మాత్రం తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: